ఏపీలోని 120 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. అధికారుల సోదాలతో అప్రమత్తం అయిన డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులకు తాళం వేసుకొని పరారయ్యారు. ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుపై ఏసీబీ దాడులు చేసిన సమయంలో కార్యాలయ సిబ్బంది భయంతో డబ్బులను బయటకు విసిరి వేసినట్టు సమాచారం. సిబ్బంది విసిరేసిన సుమారు రూ.30 వేలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు చేపట్టింది. ఏసీబీ అధికారులు రాగానే డాక్యుమెంట్ రైటర్లు వెళ్లిపోయారు. కీలక దస్త్రాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో బయట వ్యక్తులు లోపలికి రాకుండా తలుపులు వేసి తనిఖీలు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయానికి తాళలు వేసి లోపల దస్త్రాలను పరిశీలించారు.
ఇక్కడ దస్తావేజు రైటర్లకు, రిజిస్టర్లకు మధ్య పెద్దఎత్తున లావాదేవీలు నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రార్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న షాప్ లు మొత్తం వ్యాపారులు మూసివేశారు. విశాఖలోని ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారి నేతృత్వంలో రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు చేపట్టింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై వచ్చిన ఫిర్యాదులతో ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే సాధారణ తనిఖీల్లో భాగంగానే తా ము వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
This post was last modified on November 5, 2025 5:15 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…