Political News

వింత వ్యాఖ్యలతో ఆశ్చర్యానికి గురి చేసిన జగన్

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా మ‌రోసారి వింత వ్యాఖ్య‌లు చేశారు. “అవును.. జ‌గ‌న‌న్న ఉంటే ఇలా జ‌రిగేది కాదు“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. వాస్త‌వానికిఆయ‌న ఏ కాంటెస్టులో ఈ వ్యాఖ్య‌లు చేశారో తెలియ‌దుకానీ.. దీనికి రైతులు కొంద‌రు న‌వ్వుకున్నారు. ఇటీవ‌ల గూగుల్ డేటా కేంద్రంపైనా ఆయ‌న ఇలానే వ్యాఖ్యానించి సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌కు గుర‌య్యారు. తాజాగా కృష్ణాజిల్లాలో మొంథా తుఫాను ప్ర‌భావంతో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారిని ఓదార్చారు. స‌హ‌జంగానే ప్ర‌తిప‌క్ష నేత కాబ‌ట్టి.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ క్ర‌మంలో “నేనుంటే ఇలా జ‌రిగేది కాదు“ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఆయ‌న ఉంటే మొంథా తుఫాను వ‌చ్చేది కాద‌న్న అర్థంలో అన్నారో.. లేక సాయం విష‌యంలో అన్నారో.. తెలియ‌క రైతులు దిక్కులు చూశారు. ఇక‌, కృష్ణాజిల్లా రామరాజుపాలెం ప్రాంతంలోని ఆకుమర్రు లాకు వద్ద పంట పొలాలను జ‌గ‌న్ పరిశీలించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా కొంద‌రు రైతులు త‌మ పొలాల్లోకి దిగాల‌ని సూచించినా.. జ‌గ‌న్‌.. మాత్రం గ‌ట్టుపైనే ఉండి ప‌రిశీలించారు. దీంతో ప‌లువురు రైతులు.. త‌డిసిపోయిన పంట‌ల‌ను జ‌గ‌న్‌కు చూపించారు.

అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ.. త‌మ హ‌యాంలో రైతుల‌ను ఆదుకున్నామ‌ని.. వారికి బీమా క‌ల్పించామ‌ని చెప్పారు. వైసీపీ పాల‌న‌లో 85 ల‌క్ష‌ల మంది రైతుల‌కు బీమా అందిస్తే.. ఇప్పుడు ఈ సంఖ్య 19 ల‌క్ష‌ల‌కు కుదించార‌ని విమ‌ర్శించారు. మొత్తంగా 25 జిల్లాల్లో పంట‌న‌ష్టం జ‌రిగింద‌న్న ఆయ‌న‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు. రైతుల‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని, వారికి న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని చెప్పారు. మ‌రికొంద‌రు రైతులు.. త‌మ వ‌ద్ద‌కు అధికారులు వ‌చ్చి వివ‌రాలు తీసుకుని వెళ్లార‌ని చెప్పారు.

అనంత‌రం జ‌గ‌న్ మీడియాతోనూ మాట్లాడారు.. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అన్నివిష‌యాల్లోనూ విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. రైతుల‌కు స‌రైన స‌మ‌యంలో సొమ్ములు కూడా ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. మొంథా తుఫాను వ‌స్తుంద‌న్న హెచ్చ‌రిక‌లు ఉన్నా.. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాలు తీసుకోకుండా తాత్సారం చేయ‌డంతో రైతులు న‌ష్ట‌పోయార‌ని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైసీపీ వారికి అండ‌గా నిలుస్తుంద‌ని చెప్పారు. 25 జిల్లాల్లో మొంథా తుఫాను ప్ర‌భావం క‌నిపించింద‌ని, 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, కానీ ప్ర‌భుత్వం తూతూమంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. కూట‌మి పాల‌న‌లో రైతుల‌కు క్రాప్ ఇన్సూరెన్స్(పంట‌ల బీమా) ఇవ్వ‌డం లేదని అన్నారు.

This post was last modified on November 4, 2025 8:47 pm

Share

Recent Posts

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

17 minutes ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

1 hour ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

3 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

5 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

6 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

6 hours ago