భారతదేశంలో మావోయిస్టు ఉద్యమానికి ఇది ఒక అతిపెద్ద ఎదురుదెబ్బ. సీపీఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడు, అగ్రనేత అయిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, మంగళవారం (అక్టోబర్ 14) మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 60 మంది కేడర్‌తో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో భద్రతా బలగాలు చేపట్టిన నిరంతర ఆపరేషన్ల వలన మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక ఫలితమే ఈ కీలక లొంగుబాటు అని అధికార వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణకు చెందిన ఈ నేత లొంగుబాటు వెనుక చాలా రోజులుగా ఊహాగానాలు నడిచాయి. సెప్టెంబర్‌లోనే అతను ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి, ఆయుధాలు వీడనున్నట్లు పరోక్షంగా సూచించారు. “తమను తామే కాపాడుకోవాలని, లొంగిపోయి మెయిన్‌స్ట్రీమ్‌లో కలవాలని” తన తోటి సహచరులకు కోరుతూ లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని మావోయిస్టు కేడర్ నుంచి సోను నిర్ణయానికి మద్దతు లభించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ లొంగుబాటు అనేది భారతదేశంలో మావోయిస్టు ఉద్యమానికి ఒక ఊహించని దెబ్బగా భావిస్తున్నారు. 2026 నాటికి దేశం నుంచి ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే అమిత్ షా లక్ష్యానికి ఈ పరిణామం ఒక పెద్ద విజయంగా నిలిచింది. ఒక అగ్రనాయకుడు, ఇంతమంది కేడర్‌తో లొంగిపోవడం అనేది ఈ ఉద్యమం బలహీనపడుతోందనడానికి స్పష్టమైన సంకేతం.
2000 సంవత్సరం ఆరంభం నుంచి భారత్ మావోయిజం లేదా నక్సలిజాన్ని (LWE లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) ఒక తీవ్రమైన అంతర్గత భద్రతా ముప్పుగా గుర్తించింది. 2010లో ఈ ఉద్యమం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, దేశవ్యాప్తంగా సుమారు 200 జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉండేది. అయితే, 2015లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జాతీయ విధానం కార్యాచరణ ప్రణాళిక కారణంగా పరిస్థితి క్రమంగా మారింది. కేంద్ర ప్రభుత్వం, ప్రభావిత ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా, ఈ ముప్పును క్రమంగా తగ్గించింది. 2024లో, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం సంబంధిత హింసాత్మక సంఘటనలు, పౌరుల మరణాలు 2010తో పోలిస్తే ఏకంగా 81 శాతం నుంచి 85 శాతం వరకు తగ్గాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది.
This post was last modified on October 14, 2025 3:11 pm
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…