Political News

మిథున్‌రెడ్డి నివాసంలో సోదాలు?

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని రాజంపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు సోదాలు చేప‌ట్టారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ చేరుకున్న సిట్ అధికారులు ఇక్క‌డి ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఉన్న మిథున్ రెడ్డి నివాసానికి వెళ్లి.. స్థానిక పోలీసుల స‌హ‌కారంతో సిబ్బందిని తొలుత త‌మ అధీనంలోకి తీసుకున్నారు.

అనంత‌రం.. ఇంటి మొత్తాన్నీ త‌నిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించి అనుమ‌తులు ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు. అయితే.. ఈ త‌నిఖీల వ్య‌వ‌హారం మిథున్ రెడ్డికి తెలియ‌ద‌ని స‌మాచారం. దీంతో ఆయ‌న హుటాహుటిన ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో కీల‌క ప‌త్రాలు.. నాడు డిస్టిల‌రీల‌తో చేసుకున్న ఒప్పందాల‌పై సిట్ అధికారులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు అనుమ‌తి తీసుకుని.. మిథున్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేప‌ట్టారు. కాగా.. గ‌తంలోనూ ఈ కేసులో ఏ-1గా ఉన్న రాజ్ క‌సిరెడ్డి నివాసంలోనూ అధికారులు సోదాలు చేశారు. ఈ స‌మ‌యంలో కోటి రూపాయ‌ల న‌గ‌దు, బంగారు, కీల‌క ప‌త్రాలు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ క్ర‌మంలో రెండోసారి మిథున్‌రెడ్డి నివాసంలో సోదాలు చేప‌ట్టారు. ఈ వ్య‌వ‌హారాన్నిగోప్యంగా ఉంచిన అధికారులు.. కేవ‌లం చివ‌రి నిముషంలో మిథున్ రెడ్డికి స‌మాచారం అందించిన‌ట్టు తెలిసింది.

మ‌రింత బిగిసిన ఉచ్చు..

ఈ ప‌రిణామాల‌తో ఇక‌, మ‌ద్యం కుంభ‌కోణం తేలిపోయింద‌ని అనుకున్న వైసీపీ నాయ‌కుల‌కు మ‌రింత ఉచ్చు బిగిసే అవ‌కాశం ఉంటుంద‌నిప‌రిశీల‌కులు చెబుతున్నారు. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో కుదిపేసిన ఈ మ‌ద్యం కుంభ‌కోణంలో ఇప్ప‌టికే అనేక మందిఅరెస్టు అయ్యారు. ఇప్పుడు చేస్తున్న సోదాల‌తో మ‌రిన్ని కీల‌క విష‌యాలు వెలుగు చూస్తాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on October 14, 2025 2:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

7 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

8 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

8 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

9 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

11 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

11 hours ago