Political News

మిథున్ రెడ్డి మెలిక‌.. వైసీపీ ఇరుక్కుపోతుందా ..!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తెచ్చిన కొత్త డిమాండ్ కూట‌మి పార్టీల‌కు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వైసీపీకి ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తుందా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఏపీలో తెర‌మీదికి వ‌చ్చిన‌.. న‌కిలీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో .. అనేక మంది టీడీపీ నాయ‌కుల పాత్ర ఉంద‌ని తెలుస్తోంది. దీనిపై ఇప్ప‌టికే ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. మ‌రింత మంది ప్ర‌మేయం ఉంద‌న్న అధికారుల వాద‌న కూడా మ‌రోవైపు వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఉరుములు లేని పిడుగు మాదిరిగా ఎంపీ మిథున్ రెడ్డి న‌కిలీ మ‌ద్యం కేసును సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ.. తంబ‌ళ్ల‌ప‌ల్లి స‌హా.. ఎన్టీఆర్‌, తూర్పుగోదావ‌రి, వెస్ట్ గోదావ‌రి జిల్లాల్లోనూ వెలుగు చూసిన‌.. న‌కిలీ మ‌ద్యం కేసుల వివ‌రాల‌తో 12 పేజీల నివేదిక‌ను కేంద్ర హోం శాఖ‌కు పంపించా రు. త‌క్ష‌ణ‌మే ఈ వ్య‌వ‌హారంపై సిబీఐ ని వేయాల‌ని.. నిజానిజాలు వెలికి తీయాల‌ని మిథున్ రెడ్డి కోరారు. దీనిపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

అయితే.. ఇలా చేయ‌డం ద్వారా కూట‌మి ప్ర‌భుత్వాన్ని నాయ‌కుల‌ను త‌మ దారిలో కి తెచ్చుకుని.. ప్ర‌భు త్వ దూకుడుకు, వైసీపీ నేత‌ల‌పై న‌మోదు చేస్తున్న కేసుల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌న్న ఉద్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇది జ‌రుగుతుందా?  మిథున్ రెడ్డి అభ్య‌ర్థ‌న‌ను కేంద్రం ఏమేర‌కు ప‌రిశీలిస్తుంది? అనేది చూడాలి. అయితే… ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. రాష్ట్రంలోని ప్ర‌భుత్వంపై కేంద్రం సానుకూలంగానే ఉన్న‌ద‌రిమిలా.. సీబీఐ విష‌యంలో కేంద్రం మౌనంగా ఉండే అవ‌కాశం ఉంది.

ఒక‌వేళ ఈ విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకుంటే.. ఇప్ప‌టికే వెలుగులోకి వ‌చ్చిన వైసీపీహ‌యాం నాటి మ‌ద్యం కుంభ‌కోణాన్ని కూట‌మి ప్ర‌భుత్వం తెర‌మీద‌కి తెచ్చే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా.. దీనిపైనా సీబీఐని వేయాల‌ని ఇప్ప‌టికే కోరిన దరిమిలా.. మ‌రింత ఒత్తిడి పెంచే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల కులు చెబుతున్నారు. వాస్త‌వానికి గ‌తంలోనే ఈ విష‌యాన్ని సీబీఐకి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం కోరినా.. కేంద్రం ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు మిథున్ రెడ్డి క‌నుక న‌కిలీ మ‌ద్యం కుంభ‌కోణంపై ప‌ట్టుబ‌డితే.. తాము కూడా వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణంపై ప‌ట్టుబ‌డ‌తామ‌ని.. టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on October 10, 2025 7:52 pm

Share

Recent Posts

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

29 minutes ago

పంజాబ్‌ చిత్కార యూనివ‌ర్సిటీలో ఏం జరుగుతుంది?

పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఉన్న‌ చిత్కార యూనివర్సిటీలో దెయ్యం ఉందంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన ఒక పుకారు తీవ్ర ఉద్రిక్తతకు…

1 hour ago

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది.…

1 hour ago

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

2 hours ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

7 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

12 hours ago