Political News

నారా వారి రికార్డు : సీఎంగా 15 ఏళ్ల రికార్డు ..!

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు మ‌రో రికార్డును సొంతం చేసుకున్నారు. 15 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన నేతగా ఆయ‌న మ‌రో శిఖ‌రాన్ని అందుకున్నారు. వాస్త‌వానికి దేశంలో 15 ఏళ్ల‌పాటు ముఖ్యమంత్రులుగా ప‌నిచేసిన వారు ఒక‌రిద్ద‌రు ఉన్నా.. చంద్ర‌బాబు ప్ర‌త్యేక‌త వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే వ్య‌క్తి.. అందునా ప్రాంతీయ పార్టీగా ఆవిర్భ‌వించిన టీడీపీ త‌రఫున 15సంవత్స‌రాల పాటు ఆయ‌న ముఖ్య మంత్రిగా ప‌నిచేయడం రికార్డేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ నినాదంతో ఆవిర్భ‌వించిన తెలుగు దేశం పార్టీ త‌ర‌ఫున 15 ఏళ్ల పాటు తెలుగు ప్ర‌జలను పాలించిన నాయ‌కుడిగా చంద్ర‌బాబు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే.. ఇది కేవ‌లం సంఖ్యాప‌రంగానో.. సంవ‌త్స‌రాల ప‌రంగానో లెక్కించి ఇచ్చే రికార్డు కావొచ్చు. కానీ.. వ్యక్తిగ‌తంగా చూసుకుంటే.. చంద్ర‌బాబు పాల‌న‌కు కొన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఉంటున్నాయి కూడా!. ఆయ‌న ఆది నుంచి కూడా సంస్క‌ర‌ణ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు.

ప్ర‌భుత్వం మాత్ర‌మే అన్ని ప‌నులు చేయ‌లేద‌న్న‌.. చైనా(క‌మ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం) అనుస‌రించే విధానం మ‌న‌కు అప్ర‌క‌టితంగా చంద్ర‌బాబు పాల‌న‌లో క‌నిపిస్తుంది. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క‌రినీ పాల‌న‌లో భాగ‌స్వామ్యం చేసే జ‌పాన్ సంస్కృతి కూడా ఆయ‌న ప్ర‌భుత్వంలో క‌నిపిస్తుంది. అది ప‌థ‌కాల రూపంలో కావొచ్చు.. లేదా విధాన ప‌రమైన నిర్ణ‌యం కావొచ్చు. చంద్ర‌బాబు స్ట‌యిల్ వేరేగా ఉంటుంది. జ‌న్మ‌భూమి, పీ-4వంటివి ఈ ప‌థ‌కాల‌కు మ‌చ్చుతున‌క‌లు.

అదేస‌మ‌యంలో కేంద్రంలోనూ చ‌క్రం తిప్పిన నాయ‌కుడిగా చంద్ర‌బాబు రికార్డు సృష్టించారు. ఒక్క 2018-19 మ‌ధ్య ఏడాది కాలాన్ని ప‌క్క‌న పెడితే.. మిగిలిన 14 సంవ‌త్స‌రాల్లోనూ ఆయ‌న కేంద్రంలో చ‌క్రం తిప్పారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు ద‌రిమిలా.. డిజిట‌ల్ మ‌నీని ప్రోత్స‌హించేందుకు కేంద్రం నియ‌మించిన క‌మిటీకి సారథ్యం వ‌హించారు చంద్ర‌బాబు. వాజ‌పేయి ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు.. జాతీయ ర‌హ‌దారులపై అధ్య‌య‌న క‌మిటీ వేసిన‌ప్పుడు.. ఆ క‌మిటీలో బాబు లేక‌పోయినా.. స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను అందించారు. ఇలా.. ఆయ‌న ప్ర‌స్థానంలో అనేక మ‌లుపులు, మెరుపులు ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు.

This post was last modified on October 10, 2025 7:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

55 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

కొట్లాట కొత్త కాదు రేవంత్ చెబితే రాజీనామా దానం కీలక కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…

2 hours ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

3 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago