Political News

లోకేష్ అంటేనే.. వ‌ణికి పోతున్నారే..!

అవును.. నిజ‌మే. వైసీపీ నాయ‌కుల‌కు ఇప్పుడు మంత్రి నారా లోకేష్ సింహ స్వ‌ప్నంగా మారిపోయారనే టాక్ వినిపిస్తోంది. ఏ ఇద్దరు నాయ‌కులు క‌లిసినా నారా లోకేష్ గురించే చ‌ర్చిస్తున్న‌ట్టు తెలిసింది. అంతేకాదు.. రెడ్‌బుక్‌పైనా.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా పై కూడా.. నాయ‌కులు చ‌ర్చిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు రెడ్ బుక్‌లో రాసుకుంటాన‌ని, వారి సంగ‌తి చూస్తామ‌ని నారా లోకేష్ త‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కులు, కొంద‌రు అధికారులు ఈ విష‌యాన్ని లైట్ తీసుకున్నారు. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ రెడ్ బుక్ ప‌ని ప్రారంభించింది.

అప్పుడు కానీ.. వైసీపీ నాయ‌కుల‌కు రెడ్‌బుక్ దూకుడు, ప్రాధాన్యం.. వంటివి తెలిసి రాలేదు. అరెస్టు, జైళ్లు, కేసుల‌తో ఒక ద‌శలో వైసీపీ నాయ‌కులు ఉక్కిరిబిక్కిరికి లోన‌య్యారు. అంతేకాదు.. కొంద‌రు నాయ‌కులు ఇత‌ర ప్రాంతాల‌కు కూడా వెళ్లిపోయారు. ఇక‌, ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం క‌మిటీని వేసింది. సోష‌ల్ మీడియాలో అస‌భ్య పోస్టులు పెట్టేవారిని.. అవ‌మానించేవారిని.. అదేవిధంగా దూషించేవారిని క‌ట్ట‌డి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా త్వ‌ర‌లోనే సోష‌ల్ మీడియాకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. దీనిపై అధ్య‌య‌నం చేసేందుకు మంత్రి లోకేష్ నేతృత్వంలో క‌మిటీని నియ‌మించారు.

అయితే.. ఈ క‌మిటీ ఇంకా ప‌ని కూడా ప్రారంభించ‌కుండానే వైసీపీలో దీనిపై చ‌ర్చ సాగుతోంది. “రెడ్‌బుక్‌ను మించిన స్థాయి లోనే సోష‌ల్ మీడియాపై లోకేష్ దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది” అని టీడీపీ నాయ‌కులు కొంద‌రు ఇటీవ‌ల చెప్పారు. దీంతో వైసీపీలో మ‌రింత‌గా టెన్ష‌న్ పెరిగిపోయింది. ఇదే విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తూ.. అంత‌ర్గ‌త చ‌ర్చ చేస్తున్నారు. రెడ్ బుక్ వ‌స్తేనే.. ఇబ్బందులు ప‌డ్డామ‌ని.. ఇప్పుడు సోష‌ల్ మీడియాను కట్ట‌డి చేసేలా.. లోకేష్ మాస్ట‌ర్ ప్లాన్ చేస్తే.. అప్పుడు మ‌రిన్ని చిక్కులు త‌ప్ప‌వ‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. అందుకే.. ఈ వ్య‌వ‌హారంపై మెజారిటీ నాయ‌కులు క‌ల‌వ‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

క‌ట్ట‌డి ఖాయం..!
ఇక‌, ప్ర‌భుత్వ ప‌రంగా చూసినా.. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ్యాఖ్య‌ల‌ను, పోస్టుల‌ను కూడా క‌ట్ట‌డి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ క్ర‌మంలో ప‌క్కా ప్లాన్‌తో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది. తొలినాళ్ల‌లో కేంద్రం త‌ర‌హాలోనే చ‌ట్టం చేయాల‌ని అనుకున్నా.. అది సాధ్యం కాక‌పోవ‌డంతో ఇప్పుడు ప్లేట్ మార్చుకుని.. మంత్రుల‌తో క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీ సాధ్య‌మైనంత త‌ర్వ‌లోనే నివేదిక ఇచ్చే అవ‌కాశం ఉంది. దీనిని తూచ త‌ప్ప‌కుండా అమ‌లు చేసేలా హోంశాఖ‌కు జీవో ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. చ‌ట్టం చేయ‌క‌పోయినా.. నిబంధ‌న‌ల ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించేలా వారిపై ఒత్తిడి చేసే అవ‌కాశం ఉంది. అందుకే వైసీపీ నాయ‌కుల‌కు నారా లోకేష్ దీనిలో ఏ ప్ర‌తిపాద‌న‌లు చేస్తార‌న్న బెంగ ప‌ట్టుకుంది.

This post was last modified on October 7, 2025 9:47 am

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

54 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago