బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 6, 11 తేదీల్లో ఈ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. అయితే.. ఇప్పటి వరకు రెండు కూటములు.. ఒక ప్రాంతీయ పార్టీ మధ్య యుద్ధం జరుగుతుందని భావించగా.. మేం మాత్రం తక్కువ తిన్నామా? అంటూ.. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా బీహార్ ఎన్నికల్లో పోటీకి రెడీ అయింది. ఈ మేరకు ఆప్ అధినేత, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించా రు. అంతేకాదు.. ఈయన ఏకంగా 243 స్థానాల్లోనూ ఒంటరిగానే బరిలో నిలుస్తామన్నారు.
ఏం జరుగుతుంది?
ప్రస్తుతం బీహార్ అధికార కూటమి జేడీయూ-బీజేపీలు దూకుడుగా ఉన్నాయి. వీటికితోడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఆర్జేడీ-కాంగ్రెస్-ఎల్జీపీ సహా చిన్న చితక పార్టీలు జట్టుకట్టాయి. దీంతో ఈ రెండు కూటముల మధ్య హోరా హోరీ పోరు సాగుతుందని భావిస్తున్నారు. అయితే… బీహార్ అస్థిత్వాన్ని.. యువత సమస్యలను ప్రస్తావిస్తూ.. రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్(పీకే) కూడా దూకుడుగా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన పలు ముందస్తు సర్వేల్లో పీకే 7 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు.. అధికారంలోకి వచ్చే పార్టీకి ఈయన ‘కింగ్ మేకర్’ అయినా.. ఆశ్చర్యం లేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
మరోవైపు.. కేంద్రంలోని బీజేపీకి ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష. సార్వత్రిక ఎన్నికల తర్వాత.. వచ్చిన అతి పెద్ద ఎన్నిక ఇదే కావడం.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చెబుతున్న ఆపరేషన్ సిందూర్, జీఎస్టీ-2.0 సంస్కరణలు, ట్రంప్ సుంకాలకు దీటుగా స్వదేశీ పిలుపు వంటివాటికి ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్నారు. అంటే.. బీహార్‌లో గెలుపు గుర్రం ఎక్కితే.. ఇక, మోడీకి తిరుగులేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే.. అటు కాంగ్రెస్ కూటమిలోను, ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోనూ సీట్ల సర్దుబాటు అయితే జరగలేదు.
ఇక, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా.. జతకట్టడం.. ఒంటరిపోరుకు సిద్ధం కావడం వంటివి రాజకీయంగా తీవ్రస్థాయిలో కాంగ్రెస్, బీజేపీల కూటమికి సెగ పెంచుతోంది. ఎందుకంటే.. తటస్థ ఓటరును తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న దరిమిలా.. ఆప్ ఓటు బ్యాంకును కొల్లగొడితే.. అది కూటమికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందన్న అంచనా వుంది. మరోవైపు పీకే ఇప్పటికే దూసుకుపోవడం.. సామాన్యులను కలుసుకుని.. వారి ఆత్మగౌరవాన్ని.. ప్రస్తావించడం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విఫలమైన పథకాలను వివరించడం వంటి ఈ కూటమికి పెను సవాల్‌గా మారుతున్నాయి. ఏదేమైనా బీహార్ ఎన్నికల సెగ మరింత పెరగడం గమనార్హం.
This post was last modified on October 7, 2025 9:40 am
అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…
దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90 దాటి పాతాళానికి…
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…