గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా చూసుకుంటే.. ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు. నిజానికి పార్టీల తరఫున ఆయా అభ్యర్థులు లేదా సెకండ్ గ్రేడ్ నాయకులు ప్రచారం చేస్తే.. సరిపోతుంది. కానీ, ఇప్పుడు అన్నిపార్టీల నుంచి అతిరథ మహారథులు రంగంలోకి దిగిపోయారు. భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇంత సీన్ ఈ ఎన్నికలకు ఉందా? లేక నాయకులు క్రియేట్ చేశారా? దీనికి ముందు.. 2017లో జరిగిన బృహన్ ముంబై.. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను గుర్తు చేసుకోవాలి. ఆ ఎన్నికలు కూడా అన్ని పక్షాలకు ప్రధానమే!
కానీ, కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకుని.. పార్టీ అధినేతలు, అతిరథ మహారథులు దూరంగా ఉన్నారు. కేవలం ద్వితీయ శ్రేణి నాయకులకు శివసేన, బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీలు బాధ్యతలను అప్పగించాయి. కానీ, ఇప్పుడు హైదరాబాద్‌లో మాత్రం దీనికి భిన్నంగా పెద్దలే రంగంలోకి దిగేస్తుండడం.. సర్జికల్ స్ట్రయిక్స్ అంటూ. కామెంట్లు కుమ్మరిస్తుండడం.. వంటి పరిస్థితులను గమనిస్తే.. గ్రేటర్ ఎన్నికలా.. గ్రేటర్ సార్వత్రిక ఎన్నికలా? అనే చర్చ వస్తోంది. మరీ ముఖ్యంగా.. బీజేపీ తరఫున ప్రచారంలో ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. సరే.. ఈయన స్థానికుడు కనుక సరిపెట్టుకోవచ్చు.
కానీ, దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా గ్రేటర్‌లో ప్రచారానికి వస్తున్నారనే అంశమే.. మేధావులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. ఎన్నికల్లో ప్రచారం చేయడం మంచిదే. కానీ, వాటికి కూడా స్థాయి.. అనేది ఉంటుంది కదా? ప్రధాని అంతటి నాయకుడు వచ్చి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా? అనేది బీజేపీలోని ఓ వర్గంలో వస్తున్న ప్రశ్న. అదేసమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు. ఇదంతా చూస్తే.. బీజేపీ స్థానిక నేతలపై నమ్మకం లేదనైనా అనుకోవాలి? లేదా.. బీజేపీ ఇప్పటి వరకు చెప్పుకొస్తున్న కేసీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదనే విమర్శలు అబద్ధమైనా కావాలి! కేసీఆర్ బలంగా ఉండబట్టే.. ఇంత మంది రంగంలోకి దిగుతున్నారని అనుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా.. బీజేపీ వ్యూహం.. రేపు ఫలించకపోతే.. అడ్డంగా దొరికిపోయేది మోడీనే! మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 27, 2020 8:40 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…