తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు తాను చెప్పినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా కీలకమైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంపై శుక్రవారం రేవంత్ రెడ్డి సర్కారు ఏకంగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం రేపో, మాపో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు విన్న కాంగ్రెస్ శ్రేణులు, బీసీలు సంతోషంలో మునిగిపోయారు.
వాస్తవానికి ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు రేవంత్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కుల గణన తర్వాత రాష్ట్రంలో బీసీలు 42 శాతం ఉన్నారని, ఆ దామాషా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ ఘనంగా ప్రకటించారు. ఆ ప్రతిపాదనను ఆయన గవర్నర్ కార్యాలయానికి పంపారు. అయితే గవర్నర్ ఆ బిల్లును నేరుగా రాష్ట్రపతికి పంపారు. ప్రస్తతం సదరు బిల్లు రాష్ట్రపతి భవన్ లోనే మూలుగుతోంది.
అయితే ఓ వైపు హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటం, మరోవైపు పార్టీ శ్రేణుల నుంచి ఎన్నికల నిర్వహణ కోసం ఒత్తిడి పెరగడంతో రేవంత్ చివరాఖరుకు కదలక తప్పలేదు. సరే తాము పంపిన బిల్లు రాష్ట్రపతి భవన్ లో పెండింగ్ లో ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించిన రేవంత్… తమ ప్రభుత్వమే ధైర్యం చేసి మరీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా జీవోలను జారీ చేసింది.
This post was last modified on September 27, 2025 8:23 am
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…
యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…