సాధారణంగా.. రాజకీయాల్లో ఉన్న నాయకులు లక్ష్యంగా ప్రత్యర్థులు పావులు కదుపుతూ ఉంటారు. అయితే.. ఇది ఎంతవరకు అంటే.. సదరు నాయకులు పదవుల్లో ఉన్నంత వరకు . ఆ పదవులే పోతే.. ఎవరూ పట్టించుకోరు. సొంత పార్టీ నేతలు కూడా పక్కన పెడతారు. ఇది సహజంగా అందరి విషయంలోనూ.. అన్ని పార్టీల విషయంలోనూ జరిగేదే. అయితే.. దీనికి భిన్నంగా ఉంది బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీ పగ్గాలు చేపట్టారు. ఆయన హయాంలోనే గత ఏడాది ఎన్నికలు జరిగాయి. పుంజుకుంటుందని భావించిన పార్టీ చతికిల పడింది.
ఇక, రాజధాని విషయంలో ఆయన తీసుకున్న లైన్ కావొచ్చు.. లేదా కేంద్రానికి ఆయనపై టీడీపీతో కలిసి పోతున్నారు.. అనే ఫిర్యాదులు కావొచ్చు.. మొత్తానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి కన్నాను పక్కన పెట్టారు. ఇక, కేంద్రంలో పదవులు ఇస్తారని అనుకున్నా రాలేదు. రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగినా.. అది ఒట్టిదేనని తేలిపోయింది. ఇలా.. కన్నా విషయంలో వ్యూహాత్మకంగా ఆయనను పక్కన పెట్టేశారు. అంతా అయిపోయింది! -ఇలానే అనుకున్నారు అంతా!! కానీ, ఇప్పటి వరకు జరిగినవి ఒక ఎత్తయితే.. ఇప్పుడు జరుగుతున్నవి మరో ఎత్తు అంటున్నారు పరిశీలకులు.
మొత్తానికే కన్నాను ఒక విఫలమైన నాయకుడిగా చేసేందుకు, రాజకీయంగా ఆయనకు భవితవ్యం లేకుండా చేసేందుకు బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు పరిశీలకులు. బీజేపీలో ఇప్పుడు కన్నా ప్రాధాన్యం తగ్గింది. దీంతో ఆయన టీడీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబును ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ.. కన్నా మాత్రం టీడీపీలోకి వెళ్తున్నారని ప్రచారం గుంటూరులో ఠారెత్తుతోంది. దీనికి కారణం ఏంటి? అని ఆరాతీస్తే.. ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
కన్నా రాజకీయంగా పుంజుకోవడం ఇష్టంలేని గుంటూరు నేతలు.. లోపాయికారీగా ఈ ప్రచారం చేయిస్తున్నారని అంటున్నారు. వీరిలో మాజీ బీజేపీ నేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది. అదేసమయంలో కన్నా టీడీపీలోకి వస్తే.. తమకు ఇబ్బందని భావించే వారు కూడా ఈ జాబితాలో ఉన్నారని అంటున్నారు . మొత్తంగా చూస్తే టీడీపీకి దగ్గరవుతున్నారని అంటే.. వైసీపీ చేరనివ్వదు. టీడీపీ ఎలాగూ చేర్చుకోదు.. మొత్తంగా కన్నా ఉంటే.. బీజేపీలో లేదంటే ఇంటికే పరిమితమవ్వాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నారని అంటున్నారు. మరి ఈ వ్యూహాన్ని కన్నా ఎలా ఛేదిస్తారో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 10:29 am
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…