Political News

స్థానిక ఎన్నిక‌ల‌పై రేవంత్ వెన‌క‌డుగు.. రీజ‌నేంటి?

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై నిన్న మొన్న‌టివ‌ర‌కు హడావుడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా యూట‌ర్న్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చే వ‌ర‌కు వేచి చూస్తామ‌న్నారు.

అయితే, సుప్రీంకోర్టు తీర్పు తాజా ఎన్నిక‌ల‌కు సంబంధం ఏమిటనేది ప్రశ్న. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను 90 రోజుల్లో పూర్తి చేయాల‌ని హైకోర్టు గ‌డువు ఇచ్చింది. ఈ గ‌డువు ఈ నెల 30తో ముగుస్తుంది. ఇప్పటికే స్థానిక అధికారులు ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వంప్ర‌స్తుతం నిన్న‌టి దాకా ఎన్నిక‌ల‌కు “సై” అన్న స్థితిలో ఉంది.

ఇక ఇప్పుడు, సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చే వ‌ర‌కు వేచి ఉంటామ‌ని రేవంత్ రెడ్డి యూట‌ర్న్ తీసుకున్నారు. వాస్తవానికి, సుప్రీంకోర్టు కేసు వేరు. రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతి తమకు వచ్చిన బిల్లులను గరిష్టంగా మూడు మాసాలలో పరిష్కరించాల‌ని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పింది. అంద‌రూ రాజ్యాంగానికి బ‌ద్ధులై ఉండాల‌ని కూడా పేర్కొంది.

అయితే, దీనిని విభేదిస్తూ 18 ప్రశ్న‌ల‌తో రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ప్రస్తుతం ఇది విచారణ దశ‌లో ఉంది. ఐదుగురు సభ్యుల‌తో కూడిన రాజ్యాంగ ధర్మాస‌నాన్ని కోర్టు నియమించింది. దీనిపై తుది తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు.

కానీ రేవంత్ రెడ్డి, తీర్పు రావాల్సిన తర్వాతే స్థానిక సంస్థ‌లకు వెళ్లే యోచ‌న చేస్తామ‌ని చెబుతున్నారు. దీనికి కారణం, 42 శాతం బీసీల‌కు స్థానిక కోటాలో రిజర్వేష‌న్స్ కేటాయిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఇది గవర్నర్‌దగ్గర పెండింగ్‌లో ఉంది. ఆయ‌న ఆమోదించలేదు. రేవంత్ రెడ్డి భావిస్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గవర్నర్ ఆమోదం కూడా వచ్చే అవకాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో, రేవంత్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్ర‌యించి, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల గ‌డువును పెంచేలా కోరతారు. ఆ తర్వాతే స్థానికంపై నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుంది. 42 శాతం రిజర్వేష‌న్ల‌ను బీసీల‌కు కేటాయించి తర్వాతే ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని రేవంత్ స్ప‌ష్టం చేశారు.

అందువలన, సుప్రీంకోర్టు తీర్పు, గవర్నర్ ఆమోదం అనుసరించి కనీసం 6–10 మాసాల సమయం పడే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. మరోవైపు, రేవంత్ ప్రక‌ట‌న‌పై రాజకీయ విమర్శలు వస్తున్నాయి. సర్కారుపై గ్రామీణ స్థాయిలో వ్యతిరేకత ఉన్న నేప‌థ్యంలోనే ఇలా వాయిదా వేస్తున్నార‌ని బీఆర్‌ఎస్ వ్యాఖ్యానించింది.

This post was last modified on September 20, 2025 2:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

32 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago