పార్టీలో ఎంత మంది కీలక నాయకులు ఉంటే.. అంత బలం అనుకునే పార్టీలు.. వచ్చిన వారిని వచ్చినట్టు.. నచ్చిన వారినీ వచ్చేట్టు చేసుకుని చేర్చుకుంటున్నాయి. ఇలా.. బీజేపీ వ్యూహంలో ఇప్పుడు ఇద్దరు కీలక నేతలు ఉన్నారు. ప్రజలు, మహిళలు, యువతలో మంచి గుర్తింపు, రేంజ్ ఉన్న వీరిని వాడుకుని గ్రేటర్ ఎన్నికల్లో గట్టెక్కాలనేది బీజేపీ వ్యూహం. అయినా.. ఎక్కడో పార్టీలో కలవరం కనిపిస్తోంది. ఇద్దరు కీలక నేతలు ఉన్నా.. ఎక్కడా ఆ స్థాయి ఊపు కనిపించడం లేదు. వారే.. ఒకరు జనసేనాని పవన్ కళ్యాణ్, రెండు.. మాజీ ఎంపీ విజయశాంతి. పవన్.. బీజేపీతో పొత్తులో భాగంగా.. గ్రేటర్‌లో ఎన్నికల పోటీ నుంచి తప్పుకొన్నారు. ఈ క్రమంలోనే ప్రచారానికి రెడీ అయ్యారు.
అయితే.. ఎప్పుడు ప్రచారం చేస్తారో.. ఎక్కడ ప్రచారం చేస్తారో.. ఎలా ప్రచారం చేస్తారో.. క్లారిటీ లేదు. సారొస్తారొస్తారు.. ప్రచారం చేస్తారు! అంటూ.. కమలం పార్టీ నాయకుల కళ్లలో టార్చ్ లేసుకుని మరీ చూస్తున్నారు. పవన్ మాత్రం కయ్‌కుయ్ అని కూడా అనడం లేదు. ఇక, జనసేన పార్టీ కార్యకర్తలు..(ఉన్నవారి వరకు) బీజేపీతో కలిసి నడుస్తున్నారు. కానీ వీరిలోనూ జోష్ కనిపించడం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకొనక పోయి ఉంటే.. తాము పోటీలో ఉండేవారమని జనసేన కార్యకర్తలలో చాలా మంది ఆఫ్ దిరికార్డుగా మీడియా ముందు వాపోతున్నారు. ఇక, కొందరు పవన్ రంగంలోకి దిగినప్పుడు.. వద్దాంలే అనుకుని దూరంగా ఉన్నారు. ఈ పరిణామాలతో బీజేపీలో టెన్షన్ పెరిగిపోతోంది. తమ పాటికి తాము ప్రచారం చేస్తున్నా.. అనుకున్న జోష్ రావడం లేదని నాయకులు సతమతమవుతున్నారు.
మరోవైపు… ఇదే బీజేపీలో చేరేందుకు లేడీ అమితాబ్ విజయశాంతి రెడీ అయ్యారు. అయితే.. ఇంకా ముహూర్తం ఫిక్స్ కానందున దూరంగా ఉన్నా.. చేరడం అయితే.. ఖాయమైంది. ఈ క్రమంలో ఇటీవల బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాములమ్మకు ఫోన్ కొట్టారు. పార్టీకి కూసింత ప్రచారం చేయాలని కోరారు. ఇప్పటికే చేస్తున్నాను కదా! అని రివర్స్‌లో రాములమ్మ సమాధానం చెప్పిందట. నిజమే! ఇంట్లో ఉంటు వెబ్ చానెళ్లకు రాములమ్మ ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. హిందువుల ఓట్లను సమీకరించి.. బీజేపీకి లబ్ది చేకూరేలా చేస్తున్నారు. అయితే.. ఇదంతా కూడా నాలుగు గోడల మధ్యలో వెబ్ చానెళ్లకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో మాత్రమే.
అయితే.. ఇలాంటి ఇంటర్వ్యూలు ఎంత మందికి చేరతాయి? ఎంతమంది మనసు మార్చగలుగుతాయి..? ఎన్ని ఓట్లు వేయించగలుగుతాయి? అనేది బీజేపీ పెద్దల కలవరం. దీంతో వారు.. ఈ ఇద్దరు నేతల విషయంలో తీవ్ర ఆవేదన, ఆందోళన చెందుతున్నారు. పవన్ ప్రచారం చేసేందుకు ఇప్పటికే ఓ యాభై వార్డుల్లో సుడిగాలి పర్యటనలు చేసేలా స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. దీంతో కీలక నాయకులు ఆయా వార్డుల్లోకి కూడా వెళ్లడం లేదు. ఇక, విజయశాంతి రేపో మాపో.. కమలం గూటికి చేరుకుంటున్నారు కనుక ఆమె కూడా బరిలో కి దిగాలని కోరుకుంటున్నారు. కానీ, ఇద్దరూ కూడా తమ శైలిలో తాము ఉన్నారు. సో.. ఈ పరిణామాలు బీజేపీలో ఉలికిపాటుకు గురి చేస్తున్నారు. ఈ వ్యూహం బెడిసి కొడితే.. మొత్తానికే నష్టమని భావిస్తున్నాయి.
This post was last modified on November 25, 2020 12:18 pm
టిక్ టాక్... చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్…
ఇటీవలే బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజయ్యింది. 1998లో మొదటిసారి విడుదలైనప్పుడు ఇదో మాస్టర్ పీస్ లా నిలిచిపోయింది.…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయినా మహా అయితే నెల రోజులు స్ట్రాంగ్ రన్…
టాలీవుడ్ కు అత్యంత కీలకమైన సంక్రాంతి పండగ అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. బాక్సాఫీస్ విజేతగా ఒక్క శాతం అనుమానం…
ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…