వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన.. తిరుమల, తిరుపతిని ఆధారంగా చేసుకుని సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గతంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు ఇచ్చే సమయంలో జరిగిన తొక్కిసలాట, తర్వాత.. గోవుల మరణాలు.. అన్యమత ప్రచారం, అన్యమత ఉద్యోగులు.. ఇలా అనేక అంశాలను భూమన ప్రస్తావించారు. అదేసమయంలో తిరుపతిలో స్వామి కొండకు ఆనుకుని స్టార్ హోటళ్లకు.. భూములు ఇవ్వడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఇలా.. అనేక రూపాల్లో ఆయన ఉద్యమించారు.
తాజాగా కూడా మరో వివాదాన్ని భూమన తెరమీదికి తెచ్చారు. శ్రీమహావిష్ణు విగ్రహాన్ని రోడ్డుపై పడేశారని ఆయన చేసిన విమర్శ.. సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో వైరల్ అయింది. అయితే.. దీనిపై టీటీడీ బోర్డు సహా.. స్థానిక నాయకులు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. మహావిష్ణువు విగ్రహానికి,శనేశ్వరుని విగ్రహానికి తేడా తెలియకుండా టిటిడి చైర్మన్ గా రెండు పర్యాయాలు భూమన కరుణాకర్ రెడ్డి ఎలా పనిచేశారో అర్థం కావడంలేదని దుయ్యబడుతున్నారు. అంతేకాదు.. కేవలం తన రాజకీయ ఉనికి కోసం దిగజారిపోయి మీడియాలో కనిపించాలన్న ఆత్రంతో శ్రీవారిపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
తిరుమలను ప్రపంచం మొత్తం చూస్తూ ఉందన్న కనీస పరిజ్ఞానం అవగాహన లేకుండా మాట్లాడడం దారుణమని భాను ప్రకాష్ రెడ్డి సహా పలువురు నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. వైసీపీ నుంచి భూమనకు మాత్రం మద్దతు లభించడం లేదు. ఆయనకు అనుకూలంగా ఒక్క నాయకుడు కూడా నోరు పెగల్చకపోవడం గమనార్హం. కొన్నాళ్ల కిందట ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా.. వైసీపీలో భూమన గురించి.. ఎవరూ పట్టించుకోలేదు.
అంటే. దీనిని బట్టి.. భూమన ఒంటరి అయ్యారా? పార్టీ ఆయనకు ప్రాధాన్యం తగ్గించిందా? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. వాస్తవానికి భూమన తిరుపతి సహా జిల్లాలో బలమైన రెడ్డి నాయకుడిగా ఎదిగారు. గత ఎన్నికలలో తన కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నారు. కానీ, ఆయన ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి పార్టీలో భూమనకు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిందన్న చర్చ ఉంది. ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి కూడా.. మౌనంగా నే ఉంటున్నారు. మరోవైపు.. టీడీఆర్ బాండ్లలో అవకతవకలు జరిగాయని.. వీటిపై విచారణ చేపట్టాలని కూడా కూటమి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భూమనకు ఇంటా బయటా కూడా మద్దతు లభించకపోవడం గమనార్హం.
This post was last modified on September 17, 2025 3:59 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…