కడప అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ కుస్తీలు ఓ రేంజ్‌లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయి. స్థానికంగా గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న రెడ్డప్ప గారి మాధవి పై టిడిపి సహా బిజెపి, జనసేన నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఆమె తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, తను తీసుకున్న నిర్ణయమే సరైనదిగా భావిస్తున్నారని గతంలోని టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అధికారులను కూడా తిట్టడం అదేవిధంగా కౌన్సిల్ లోను తనకు సీటు ఇవ్వలేదని అలిగి యాగి చేయడం వంటివి చర్చకు దరి తీశాయి.
ఆ తర్వాత కూడా ఆమె పనితీరులో ఏమాత్రం మార్పు రాలేదని అంటున్నారు. ఇక పార్టీ విషయాలు కూడా తమకు చెప్పకుండా చేస్తున్నారని, కనీసం జిల్లాలో ఉన్న కీలక నాయకులకు కూడా సమాచారం ఇవ్వడం లేదన్నది టిడిపి నాయకులు గత నుంచి చెబుతున్న మాట. ఇక ఇప్పుడు ఈ పరంపరలో బిజెపి, జనసేన నాయకులు కూడా చేరారు. వాస్తవానికి కడపలో జనసేన పెద్దగా లేదు. కానీ, బిజెపి కొంత హవా చాలా ఇస్తోంది. ఆదినారాయణ రెడ్డి వర్గం నుంచి కొంత మంది నాయకులు జిల్లాలో ప్రభావం చూపిస్తున్నారు.
అయితే ఎమ్మెల్యే మాధవి వ్యవహారంపై వారు నిప్పులు చెరుగుతుండడం విశేషం. కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని, తాము కూటమిలో ఉన్నామన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని వారు చెబుతున్నారు. తాము ఏ పని మీద వెళ్లినా.. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, ఫోన్లు కూడా ఎత్తడం లేదని తాజాగా బిజెపి నాయకులు విమర్శలు గుర్తించారు. ఇక జనసేన నాయకులు ఉన్న చోట కూడా మాధవి పనులు చేయించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
వాస్తవానికి రాజకీయంగా కూటమి నాయకుల మధ్య సఖ్యత ఉండాలని పై స్థాయి నుంచి ఆదేశాలు వస్తున్న విషయం తెలిసిందే. అందరూ కలిసికట్టుగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుంటారని కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా బీజేపీ అగ్రనాయకులు చెబుతున్నారు. కానీ, ఈ విషయంలో ఇతర జిల్లాల కంటే కూడా కడపలో ఈ గ్యాప్ ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఎమ్మెల్యే వ్యవహార శైలిపై వస్తున్న ఈ విమర్శలను ఆమె సీరియస్గా తీసుకుంటారా లేక ఇవన్నీ తనపై జరుగుతున్న కుట్రని కొట్టి పారేస్తారానేది చూడాలి. ఏది ఏమైనా కడప నియోజకవర్గంలో మాధవి వ్యవహార శైలిపై మాత్రం సొంత పార్టీ నుంచి కూటమి పార్టీల వరకు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది వాస్తవం.
This post was last modified on September 17, 2025 10:11 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…