జిల్లాలు అభివృద్ధి చెందితేనే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు రోజుల పాటు అమరావతిలోని సచివాలయంలో నిర్వహించి కలెక్టర్ల సదస్సు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు పలు విషయాలపై మరోసారి కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాల అభివృద్ధికి ఇప్పటికే రోడ్ మ్యాప్‌ను రెడీ చేశామని చెప్పారు. ఈ క్రమంలో ఓ పది సూత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్న ఆయన వాటిని కలెక్టర్లు పాటించాలని అన్నారు. వాటిని ఫాలో అయితే.. జిల్లాలు డెవలప్ అవుతాయని.. తద్వారా రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పారు.
ప్రధానంగా పెట్టుబడులకు పెద్దపీట వేయాలని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. యువతలో నైపుణ్యాన్నిపెంచాలన్నారు. పర్వావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. అదేసమయంలో ఉద్యోగ, ఉపాధికల్పనకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్స హించాలని సూచించారు. ప్రతి పనినీ మనసు పెట్టిచేయాలని.. కృతకంగా చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. అధికారులు.. ప్రజలకు మధ్య గ్యాప్ పెరగకుండా చూడాలన్నారు. అదేసమయంలో ప్రజాప్రతినిధుల వినతులను కూడా పట్టించుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. ఇవన్నీ.. పాటిస్తే.. జిల్లా అభివృద్ధి ఎందుకు సాధ్యం కాదన్నారు.
వృద్ధిపై దృష్టి
జిల్లా అభివృద్ధి చెందాలంటే.. ఆదాయం కూడా బాగుండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం 12.02 శాతంగా ఉన్న వృద్ధిని వచ్చే ఏడాది కల్లా 15 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రజలకు ఇస్తున్న ఇతర పథకాలతో కలిపి మొత్తం ఏడాదికి 76 వేల కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. గతేడాది 12.02 శాతం వృద్ధి సాధించామన్న ఆయన.. వచ్చే ఏడాది 15 శాతం లక్ష్యంతో ముందుకు సాగాలని కలెక్టర్లకు సూచించారు. అయితే.. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వృద్ధి చాలా బాగుందన్న చంద్రబాబు.. మరికొన్ని వెనుకబడ్డాయని లిస్టు చదివి వినిపించారు.
ఉపాధి కల్పనకు భవిష్యత్తులో చాలా ప్రాధాన్యం ఉంటుందని .. దానిని వినియోగించుకుని జిల్లాల్లో ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు సూచించారు. “ఒక కుటుంబం.. ఒక వ్యాపారవేత్త నినాదం“ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా మారాలని సూచించారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలని తెలిపారు. రిసోర్సులను చక్కగా వినియోగించుకోవాలన్నారు. ఏం చేస్తున్నా.. ఎలా ఉన్నా.. పది సూత్రాలను మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. సౌర విద్యుత్తుకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రజల ఆర్థిక స్థాయిలోనూ మార్పులు తీసుకురావాలని సూచించారు.
This post was last modified on September 17, 2025 7:49 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…