Political News

`ఇంజనీర్ అంబేడ్క‌ర్‌`ను అరెస్టు చేశారు!

విద్యుత్ క‌నెక్ష‌న్ కావాలంటే లంచం.. మీట‌రు మార్చాలంటే లంచం.. బిల్లు క‌ట్టేందుకు స‌మ‌యం కోరితే లంచం.. డబుల్ ఫేజ్ నుంచి సింగిల్ ఫేజుకు మార్చాల‌న్నా లంచం.. చిరు ఉద్యోగి బ‌దిలీ కోరితే లంచం.. దిగువ స్థాయి ఉద్యోగి ప్ర‌మోష‌న్ కోరితే లంచం.. ఇలా అన్నింటా.. లంచం.. లంచం.. అంటూ.. అవినీతి అన‌కొండ‌లా చెల‌రేగిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఆఫ్ ఎల‌క్ట్రిక్స్‌(ఏడీఈ) అంబేడ్క‌ర్‌ను తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. “ఆయ‌న అవినీతి.. త‌వ్వే కొద్దీ బ‌య‌ట ప‌డుతోంది.“ అని అధికారులు పేర్కొన్నారంటే.. అంబేడ్క‌ర్ పేరు అవినీతి ప‌రంప‌ర‌లో ఏ రేంజ్‌కు చేరిందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ట్ట‌ల‌కు క‌ట్ట‌ల నోట్లు.. కిలోల కొద్దీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎవ‌రీయ‌న‌..

తెలంగాణ విద్యుత్ శాఖ‌లో లైన్‌మెన్‌గా చేరిన అంబేడ్క‌ర్‌.. ప్ర‌స్తుత ఏడీఈగా కొన‌సాగుతున్నారు. ఇబ్ర‌హీంబాగ్‌లో ప‌నిచేస్తున్నారు. అయితే..విద్యుత్ శాఖ‌లో చిరు ఉద్యోగుల‌ను కూడా బ‌దిలీ చేసేందుకు ఆయ‌న చేతులు త‌డ‌ప‌క‌పోతే.. పెన్ను ప‌ట్టుకోర‌నే వాద‌న ఉంది. అంతేకాదు.. వ్యాపారుల నుంచి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల వ‌ర‌కు.. సొంత ఇళ్ల దారుల నుంచి ప్రైవేటు వ్య‌క్తుల వ‌ర‌కు.. ఏం చేయాల‌న్నా.. లంచం.. లంచం.. అనే మాట‌ను అంబేడ్క‌ర్ పుణికి పుచ్చుకున్నారు.

ఎంత‌లా అంటే.. సొంత ఆఫీసు లో ఉన్న ఉద్యోగికి ప‌నిచేసేందుకు కూడా!. అందుకే ఆయ‌న‌పై గుట్ట‌లుగా అందిన ఫిర్యాదుల్లో స‌గం విద్యుత్ శాఖ నుంచే అందాయ‌ని అధికారులు చెబుతున్నారు. దీంతో రెండు రోజుల పాటు అంబేడ్క‌ర్ నివాసాలు.. ఆయ‌న బంధువుల ఇళ్ల‌పైనా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. కోట్ల రూపాయ‌ల సొమ్ముతో పాటు.. ఆస్తులు, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం.. మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న‌ను అరెస్టు చేశారు.

ఇవీ అక్ర‌మాస్తులు..!

+ అంబేడ్కర్‌ బంధువు ఇంట్లో రూ.2 కోట్ల నగదు
+ శేరిలింగపంల్లిలో రెండు అక్ర‌మ సంపాద‌న‌తో వ‌చ్చి ఇళ్లు.
+ గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం
+ హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో 6 ఇళ్లు
+ ఖాళీ ప్లాట్లు
+ రెండు హైఎండ్ కార్లు
+ 2కిలోల‌కు పైగా బంగారు ఆభరణాలు
+ బ్యాంకు డిపాజిట్లు
+ 10 ఎక‌రాల‌ వ్యవసాయ భూమి
+ బ్యాంకు బ్యలెన్స్‌ రూ.78లక్షలు
+ షేర్లలో రూ.36 ల‌క్షల పెట్టుబడులు
+ ఒక కారులో దాచిన సొమ్ము.. 5.5 ల‌క్ష‌లు
+ మొత్తం 5 బృందాలు.. 15 చోట్ల సోదాలు.

This post was last modified on September 16, 2025 9:41 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

48 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

7 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago