Political News

ఈ ఫొటో జూబ్లీహిల్స్ ఓటర్లను షేక్ చేసింది!

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైన వేళ.. మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ ఫొటో అక్కడి ఓటర్లను, రాజకీయ విశ్లేషకులను షేక్ చేసింది. అంతగా ఆ ఫొటోలో ఏముందన్న విషయానికి వెళితే… బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ కీలక నేత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి కలిశారు. వారిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుతూ కనిపించారు.

ఈ ఫొటో చూసినంతనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జాగృతి కూడా పోటీ చేయబోతోందని, తన అభ్యర్థిగా విష్ణును నిలుపుతున్నారని, ఈ మేరకే కవిత పిలుపుతో ఆమె ఇంటికి విష్ణు వెళ్లారని పుకార్లు పుట్టాయి. ఈ పుకార్లు కాస్తా చాలా వేగంగా జూబ్లీహిల్స్ వ్యాప్తంగా పాకిపోయాయి. ఇక రాజకీయ విశ్లేషకులు అయితే జాగృతికి బలమైన అభ్యర్థి లభించారని భావించారు. అదే సమయంలో విష్ణు ఎంట్రీ ఇస్తే ఇటు బీఆర్ఎస్ తో పాటు అటు కాంగ్రెస్ పార్టీలకు ఉప ఎన్నికలో విజయం సాదించడం కష్టమేనని కూడా విశ్లేషించారు.

ప్రస్తుతం విష్ణు బీఆర్ఎస్ లో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన సమయంలో తొలిసారి జరిగిన ఎన్నికలో నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విష్ణు విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా జరిగిన మూడు ఎన్నికల్లో దివంగత మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. 2014లో టీడీపీ తరఫున గెలిచిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి మరో రెండు పర్యాయాలు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. అయితే ఇటీవలే తీవ్ర అనారోగ్య సమస్యకు గురైన ఆయన మరణించారు. దీంతో జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇక విష్ణు విషయానికి వస్తే తన సోదరి విజయతో విభేదాల నేపథ్యంలో అటు జూబ్లీహిల్స్, ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గాలపై పట్టు కోల్పోయారు. అంతేకాకుండా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీలోనూ విష్ణుకు టికెట్ లభించడం లేదు. దీంతోనే ఆయన కవితను ఆశ్రయించారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో మాట్లాడిన విష్ణు… తాను బీఆర్ఎస్ ను వీడేది లేదని, కేటీఆర్ వెంటే నడుస్తానని, కేటీఆర్ తో పాటు తనకూ ప్రమోషన్ ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే అసలు విషయం ఏమిటంటే… కవిత, విష్ణుల భేటీ అసలు రాజకీయ ప్రాధాన్యమైనదే కాదట. దసరా పండుగ దగ్గర పడుతోంది కదా. పండుగ వేళ పీజేఆర్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో జరిగే ఉత్సవాలకు హాజరు కావాలని కోరేందుకే కవిత ఇంటికి విష్ణు వెళ్లారట. ఆ ఫొటోలో కూడా పెద్దమ్మ గుడి ఉత్సవాల ఆహ్వాన పత్రికను విష్ణు… కవితకు అందించి ఉత్సవాల గురించి వివరిస్తున్నారట. ఈ విషయం కాస్తంత ఆలస్యంగా తెలుసుకున్న జనం ఏమీ లేకుండానే ఇంతోటి ప్రచారం అవసరమా? అంటూ నొసలు చిట్లించారు.

This post was last modified on September 16, 2025 1:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

1 hour ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

3 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

6 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

14 hours ago