Political News

పీఎం-సీఎం.. త‌ర్వాత క‌లెక్ట‌రే: చంద్ర‌బాబు

ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో దేశ ప్ర‌ధాని, రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌ర్వాత‌.. క‌లెక్ట‌ర్ల‌కు కీల‌క పాత్ర ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు  క‌లెక్ట‌ర్లు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచించారు. తాజాగా అమ‌రావ‌తి స‌చివాల‌యంలో రెండు రోజుల పాటు నిర్వ‌హించే క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సును ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్ర అభివృద్ధి, విజ‌న్ 2047 ల‌క్ష్యాలు స‌హా పీ-4, పెట్టుబ‌డులు వంటి కీలక అంశాల‌పై వారికి దిశానిర్దేశం చేశారు.

ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల ముందు.. తాము రెండు ర‌కాలుగా ప్ర‌జ‌ల‌కు హామీలు ఇచ్చామ‌ని సీఎం తెలిపారు. ఈ క్ర‌మంలోనే అభివృద్ధి, సంక్షేమం రెండు క‌ళ్లుగా పాల‌న‌ను ముందుకు తీసుకువెళ్తున్నామ‌ని చెప్పారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. క‌ష్టాలు వ‌చ్చినా.. సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌ల సంతృప్తి, సంతోష‌మే త‌మ ప్ర‌భుత్వానికి అత్యంత కీల‌క‌మ‌ని వ్యాఖ్యానించారు.  ఈ క్ర‌మంలో జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు కూడా కీల‌క రోల్ ఉంద‌న్నారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే.. విజ‌న్ ఉన్న అధికారులు అవ‌స‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా పీ-4 ద్వారా వ‌చ్చే నాలుగు సంవ‌త్స‌రాల్లో 20 ల‌క్ష‌ల కుటుంబాల‌ను పేద‌రికం నుంచి బ‌య‌టకు తీసుకురావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. 2047 నాటికి స్వ‌ర్ణాంధ్ర సాకార‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. గ‌తంలో హార్డ్‌వర్క్‌ ఉండేదన్న ఆయ‌న ప్ర‌స్తుతం `స్మార్ట్‌ వర్క్‌` వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చింద‌న్నారు. భారత్‌ను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్ర‌ధాని మోడీ.. రాష్ట్రాన్ని ప్ర‌థ‌మ స్థానంలో నిలిపేందుకు కూట‌మి ప్ర‌భుత్వం క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టు చెప్పారు.

అదే మీకు బైబిల్‌-ఖురాన్‌-భ‌గ‌వ‌ద్గీత‌!

కేంద్రం రూపొందించిన విక‌సిత్ భార‌త్ మాదిరిగానే ఏపీలోనూ స్వ‌ర్ణాంధ్ర‌-2047ను రూపొందించామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. జిల్లాల్లో ప్ర‌గ‌తి సాధిస్తేనే అది రాష్ట్రానికి చేరుతుంద‌న్న ముఖ్య‌మంత్రి.. దీనికి క‌లెక్ట‌ర్లు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేయాల‌న్నారు. “స్వర్ణాంధ్రప్రదేశ్‌-2047 అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ కావాలి.“ అని చంద్ర‌బాబు ఆదేశించారు. రాష్ట్రంలోని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌.. డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ లక్ష్యంతో ముందుకు సాగాల‌ని ఆకాంక్షిస్తున్నామ‌ని.. దీనికి క‌లెక్ట‌ర్లు దోహ‌ద ప‌డాల‌ని అన్నారు.

Kumar

Recent Posts

గొడవలతో భార్యతో మాట్లాడకపోతే గృహ హింస కాదు

గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…

4 hours ago

ప్రభాస్ సినిమా పోతుందని ముందే తెలుసట

‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…

7 hours ago

లెనిన్ మీద మెగాభిమానుల గుస్సా

అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…

9 hours ago

చిరుకు తండ్రిగా గ‌ర్వం… న‌టుడిగా క‌ష్టం

రెండో సినిమా మ‌గ‌ధీర‌తోనే తాను తండ్రికి త‌గ్గ త‌న‌యుడిని అని చాటుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఇక…

10 hours ago

పాప రాలేదు.. కుక్క ఇక లేదు.. ఏపీకి స‌వాల్‌గా కేసు!

ఏపీ ప్ర‌భుత్వానికి.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా పోలీసుల‌కు కూడా ఓ కేసు స‌వాల్‌గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…

10 hours ago

కంగనా క్రేజ్ మటాష్

ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…

12 hours ago