సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాల్లో బనకచర్ల ప్రాజెక్టు ఒకటి. ఇప్పటికే రాష్ట్రంలో పోలవరం, వెలిగొండ సహా పలు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఇదే విధంగా రాయలసీమ ప్రాంతానికి కీలకంగా భావిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాలెక్కించాలన్నది చంద్రబాబు వ్యూహం. అయితే దీనికి సంబంధించి భారీ ప్రణాళికలు ఉండడంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగానే అవుతుందని అంచనా వేశారు.
సుమారు 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిని కేంద్ర ప్రభుత్వంతో చేపట్టాలని కూడా ఒక దశలో భావించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం.. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేయటం వంటివి గత రెండు నెలల కాలంలో జోరుగా సాగాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా మాటల యుద్ధం చోటుచేసుకుంది. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ అన్యాయం జరగదని, ఇది రాయలసీమను సస్యశ్యామలం చేయడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అదేవిధంగా రైతులకు కూడా మేలు చేసే ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు.
ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు ఇచ్చే విషయం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆయన పెట్టుకున్న ప్రణాళికను స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 80 వేల కోట్ల రూపాయల పైగా ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేసిన ప్రాజెక్టు కు నిధులు కేంద్రం నుంచి తీసుకురావాలని తొలుత భావించారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదని పైగా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు ఇస్తున్న నిధులు ఇతర ప్రాజెక్టులకు ఇస్తున్న నిధులు వంటి వాటికే కేంద్ర ప్రభుత్వం పరిమితమయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు బనకచర్ల విషయంలో కీలక ఆలోచనను చేయడం విశేషం.
ఈ ప్రాజెక్టును పిపిపి విధానంలో నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేసే తీరుతామని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన నిధులను ఏ విధంగా తెస్తారన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. అన్ని ప్రాజెక్టులను నేరుగా డబ్బులు పెట్టే చేయాల్సిన అవసరం లేదని కొన్ని కొన్ని ప్రాజెక్టులను అప్పులు చేసి పూర్తిచేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బనకచర్ల ప్రాజెక్టును కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పూర్తిచేసే అవకాశం ఉందని చెప్పటం విశేషం.
సో దీనిని బట్టి చంద్రబాబు స్పష్టమైన క్లారిటీతోనే ఉన్నారు. బనకచర్ల ప్రాజెక్టును పూర్తచేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ప్రాజెక్టు ఈ ఏడాది చివరిలో గాని వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on September 14, 2025 11:21 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…