బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి నితీష్ కుమార్ పై ఆర్జేడీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. ఈమధ్యనే జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 125 సీట్లతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కూటమి గెలుచుకున్న సీట్లలో 73 సీట్లు బీజేపీ గెలిస్తే 43 సీట్లను నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయు గెలుచుకున్నది. మిగిలిన సీట్లను కూటమిలోని మరో రెండు పార్టీలు గెలుచుకున్నాయి. నిజానికి 43 సీట్లలో మాత్రమే గెలిచిన జేడీయుకి మామూలుగా అయితే ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం లేదు.
కానీ ఎన్నికలకు ముందే నితీష్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన బీజేపీ ఇష్టం లేకపోయినా కమిట్ మెంటును నిలుపుకున్నది. అప్పటి నుండి 76 సీట్లు గెలిచి ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ర్యాంగింగ్ చేయటం మొదలుపెట్టేసింది. మొదటగా మంత్రి మేవాలాల్ పై ఆరోపణలతో విరుచుకుపడిపోయింది. 2017లో మేవాలాల్ పై నమోదైన కేసును తవ్వి తీసింది. దాంతో బాధ్యతలు తీసుకున్న గంటల వ్యవధిలోనే మంత్రి రాజీనామా చేసి మాజీ అయిపోయారు. తర్వాత మరో మంత్రిపైన ఉన్న కేసులను తిరగతోడుతోంది.
ఇదే సమయంలో నితీష్ ను అపాయింటెడ్ సిఎంగా ఎద్దేవా చేస్తోంది. బీజేపీ అపాయింటెడ్ సీఎం అంటూ సంబోంధిస్తున్నారు ఆర్జేడీ నేతలు. ఎటువంటి అధికారాలు లేని సీఎం ఎవరయ్యా అంటే అది నీతీష్ మాత్రమే అంటు ప్రతిరోజు ఎగతాళి చేస్తున్నారు. ఆర్జేడీ సీనియర్ నేత అమరనాద్ గమీ మాట్లాడుతూ బీజేపీ నామినేటెడ్ సీఎం నితీష్ కుమార్ తమతో చేతులు కలపాలంటూ ఆహ్వానించటం గమనార్హం. తొందరలోనే నితీష్ ప్రభుత్వం కుప్ప కూలిపోవటం ఖాయమంటు జోస్యం చెప్పారు. దీంతో పాటు ప్రతిరోజు టార్గెట్ చేసుకున్నట్లుగా నితీష్ తో పాటు సహచర మంత్రులపై ఆరోపణలతో విరుచుకుపడిపోతోంది ఆర్జేడీ.
నితీష్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి స్టీరింగ్ మొత్తం బీజేపీ తన చేతిలోనే పెట్టుకుందంటు ఎద్దేవా చేశారు. మంత్రివర్గంలో బీజేపీ సంఖ్య ఎక్కువగా ఉండటమే దీనికి నిదర్శనంగా చెప్పారు. సీఎం పీఠంపై ఎంతో కాలం కూర్చోలేని కారణంగా ఇఫుడు రాజీనామా చేసి తమతో చేతులు కలపాలంటూ నితీష్ కు ఆర్జేడీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. పైగా బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమికి నితీష్ నాయకత్వం వహించాలని గమీ ఆహ్వానించటం విచిత్రంగా ఉంది. సీఎంగా బీజేపీ దింపేసేంత వరకు వెయిట్ చేయకుండా ముందే రాజీనామా చేసేసి తమతో చేతులు కలిపితే చాలా గౌరవంగా ఉంటుందంటు గమీ పదే పదే చెబుతున్నారు. మొత్తానికి ఏదో అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయిన నితీష్ ను ఆర్జేడీ ప్రశాంతంగా కూర్చోనిచ్చేట్లు కనబడటం లేదు.
This post was last modified on November 24, 2020 5:44 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…