జీఎస్టీ తగ్గింపు ప్రభావం రాష్ట్రంలో ఎంతవరకు ఉంటుంది? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ మేరకు దీని ప్రభావం పడుతుంది? అనేది ఆర్థిక శాఖలో చర్చిగా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా పన్నులపై ఆధారపడి పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటివి ఆర్థికంగా ప్రభుత్వానికి తీవ్ర భారం అయినటువంటి పథకాలు.
అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు వీటిని అమలు చేస్తున్నారు. ఇంకా మరో రెండు కీలక పథకాలు అమలు కావలసినవి ఉన్నాయి. వాటిని పక్కన పెట్టినా.. ప్రస్తుతం అమలు జరుగుతున్న వాటిని గమనిస్తే ఏటా 4 వేల కోట్ల రూపాయలు పైగా ఖర్చు అయ్యే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అదేవిధంగా ఏటా 12 వేల కోట్ల రూపాయలు అంచనాతో ప్రారంభించిన ‘తల్లికి వందనం’ పథకం, అదేవిధంగా ఏటా 18 నుంచి 22 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే అన్నదాత సుఖీభవ వంటివి సర్కారుకు పెద్ద ఆర్థిక భారం అనే చెప్పాలి.
ఇటువంటివి అమలు చేయాలి అంటే కచ్చితంగా రాష్ట్రానికి రాబడి ముఖ్యం. ‘సంపద సృష్టి’ అంటే ఒకవైపు పరిశ్రమలు మరోవైపు అభివృద్ధి వంటివి జరిగినా.. పన్నుల రూపంలో వచ్చే ఆదాయమే ప్రభుత్వానికి కీలకం. ఇటువంటి సమయంలో జీఎస్టీ లో శ్లాబులను మార్చడం ద్వారా పన్ను రేట్లు తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సహజంగానే ఆదాయం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పుంజుకుంటుంది.. అనేది ఆర్థిక శాఖ వర్గాల్లో చర్చగా మారింది.
దీంతో భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై ప్రభావం పడుతుందనేది అధికారులు చెబుతున్న మాట. దీనిని అధిగమించేందుకు ఇతర వ్యూహాలతో ముందుకు సాగాలి.. ఆదాయం పెంపుపై ఎటువంటి విధానాలను అనుసరించాలి.. అనేది ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది. సహజంగా జిఎస్టిలో రెండు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. ఒకటి నేరుగా జీఎస్టీ లో వచ్చే పన్నుల ఆదాయం. దీంతో పాటు కేంద్రం నుంచి జిఎస్టి రూపంలో వాటా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుంది.
ఇప్పుడు శ్లాబును తగ్గించడం ద్వారా సహజంగానే పన్ను ఆదాయం తగ్గిపోతుంది. ఇటు రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో పాటు అటు కేంద్రం నుంచి వచ్చే వాటా కూడా తగ్గితే రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ఆధారపడి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కుంటుపడే అవకాశం ఉంటుందన్నది ఆర్థిక శాఖ నిపుణులు చెబుతున్నారు. మరి దీని నుంచి అధిగమించేందుకు సంపాదన సృష్టించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందనేది చూడాలి.
This post was last modified on September 9, 2025 2:23 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…