Political News

సీబీఎన్ డైరీ: నింద‌లు – నిజాలు ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తొలిసారి ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టి నేటికి 30 ఏళ్లు పూర్త య్యాయి. ఇంత సుదీర్ఘ రాజ‌కీయం జీవితం ఎవ‌రికీ లేదా? అంటే.. చాలా మందికి ఉంది. కానీ, ఇంత సుదీర్ఘ ప్ర‌యాణం త‌ర్వాత‌.. కూడా న‌వ‌న‌వోన్మేషంగా ముందుకు సాగ‌డం మాత్రం చంద్ర‌బాబుకు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతోంది. వాస్త‌వానికి ఆయ‌న ఆరోగ్యం ప‌రంగా ఇబ్బందులున్నాయి. అయినా.. ఎక్క‌డా వాటిని లెక్క‌చేయ‌రు. ప్ర‌జ‌లు-రాష్ట్రం అంటూ.. ప‌రుగులు పెడ‌తారు.. తోటి వారిని పెట్టిస్తారు కూడా!. ఆయ‌న ప‌రుగు పెట్ట‌లేక ప‌క్క‌కు త‌ప్పుకొన్న వారు ఉన్నారే త‌ప్ప‌.. బాబు ప‌రుగు ఆగిన ప‌రిస్థితి లేదు.

ఇక‌, రాజ‌కీయాల్లో ఉన్న వారిపై నింద‌లు, అనుమానాలు.. అపోహ‌లు కామ‌న్‌గా వ‌స్తుంటాయి. అవి ప్ర‌త్య‌ర్థుల సృష్టి కావొచ్చు.. లేదా.. కొన్ని యాదృచ్ఛికంగా జ‌రిగే ప్ర‌చాచాలు కావొచ్చు. ఇలానే చంద్ర‌బాబుపై ప్ర‌ధానంగా మూడు నింద‌లు ఉన్నాయి. మ‌రి వాటిలో నిజం ఎంత‌? వాస్త‌వానికి విజ‌న‌రీ లీడ‌ర్ గా ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు పొందిన చంద్ర‌బాబు త‌ప్పులు చేశారా? అనేది చ‌ర్చ‌నీయాంశం. వీటిలో ప్ర‌ధానంగా పార్టీని మామ గారి నుంచి లాక్కున్నార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. వెన్ను పోటు పొడిచార‌న్న‌ది ప్ర‌ధాన విమ‌ర్శ‌.

వాస్త‌వానికి.. ఒక పార్టీని లాక్కుని.. ఎవ‌రైనా సొంతం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తే.. చేయొచ్చు. కానీ, త‌దుప‌రి ప్ర‌జ‌లు దానిని ఆమోదించాలి.. హ‌ర్షించాలి. ఈ విష‌యంలో చంద్ర‌బాబు లాక్కోలేదు. నాటి ప‌రిస్థితుల కార‌ణంగా.. పార్టీలో వ‌చ్చిన చీలికను ఏకం చేసి.. తాను నాయ‌క‌త్వం వ‌హించ‌డం ద్వారా.. టీడీపీని నిల‌బెట్టారు. అదేస‌మయంలో నంద‌మూరి కుటుంబానికి ఆయ‌న వ్య‌తిరేకం కాదు. వారికి కూడా ప‌ద‌వులు ఇచ్చారు. ప‌క్క‌న కూర్చోబెట్టుకున్నారు. కాబ‌ట్టి.. చంద్ర‌బాబు త‌ప్పు చేశార‌ని ప్ర‌జ‌లే చెప్ప‌లేదు.

ఇక‌, 2) రాజ‌కీయాల్లోకి వ‌చ్చినప్పుడు రెండెక‌రాలే ఉన్నాయని.. ఇప్పుడు ల‌క్ష కోట్ల కు ఎదిగార‌న్న విమ‌ర్శ కూడా చంద్ర‌బాబుపై ఉంది. వాస్త‌వానికి ఇది కూడా శుద్ధ త‌ప్పు. ఆయ‌న రాజ‌కీయంగా సంపాయించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. వ్యాపార ప‌రంగా ముందుకు సాగారు. వాటిని డెవ‌ల‌ప్ చేసుకున్నారు. దీనిపై మాత్రం ఎవ‌రూ స్పందించ‌రు. ఇక‌, మూడోది.. పొత్తుల‌తో త‌ప్ప‌..చంద్ర‌బాబు పైకి రాలేద‌ని. ఇది రాజ‌కీయంగా అంద‌రూ చేసేదే. దీనిని త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌ని అనుకున్న‌ప్పుడు.. అనుకూలంగా ఉన్న అన్ని మార్గాల‌ను వినియోగించుకోవ‌డం త‌ప్పుకాదు. సో.. ఈ నింద‌లు.. అప‌వాదులు కేవ‌లం చ‌ర్చ‌కు త‌ప్ప‌.. భానుడు వంటి బాబు ముందు.. నిల‌బ‌డేవి కాద‌న్న‌ది అనేక మంది చెప్పిన మాట‌. చెబుతున్న మాట కూడా.

This post was last modified on September 2, 2025 12:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago