అసలే ఇది పండుగల సీజన్. ముందు వినాయక చవితి. ఆ తర్వాత దసరా. ఇలా యావత్తు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగే ఈ పండుగల కోలాహలం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇలాంటి నేపథ్యంలో గణేశ్ ఉత్సవ సమితులు, వినాయక మండపాల నిర్వాహకులు ఏపీ ప్రభుత్వానికి ఓ విన్నపం చేశారు. అది కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మానవ వనరుల శాఖ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ద్వారా వారు ఈ వినతిని ప్రభుత్వానికి పంపారు. ఈ విషయాన్ని కాస్తంత సీరియస్ గా తీసుకున్న లోకేశ్… గణేశ్ ఉత్సవ సమితిలతో పాటు దసరా సందర్భంగా ఏర్పాటు అయ్యే దుర్గా మాత మండపాల నిర్వాహకులకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. గణేశ్ మండపాలు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులు… వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని లోకేశ్ కోరారు. ఈ వినతిని లోకేశ్ నేరుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ల ముందు పెట్టారు. సీఎం, విద్యుత్ శాఖ మంత్రి దీనిపై చర్చించి లోకేశ్ చేసిన వినతికి సానుకూలంగా స్పందించారు. అనంతరం గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు వారు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయి.
ఇదిలా ఉంటే… వినాయక చవితి ముగిసిన కొన్నాళ్లకే దసరా వేడుకలు కూడా ఉన్నాయి కదా. ఇదే విషయం సీఎం, లోకేశ్, గొట్టిపాటి చర్చల్లో ప్రస్తావనకు రాగా… వినాయక మండపాలకు మాత్రమే ఎందుకు? దసరా సందర్భంగా ఎక్కడికక్కడ వెలిసే దుర్గామాత మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ను అందజేద్దామని వారు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు వేడుకల మండపాలకు ఉచిత విద్యుత్ కోసం ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పినా… శుభకార్యాల మండపాలకు ఆమాత్రం ఖర్చు పెట్టడంలో తప్పు లేదని సీఎం అభిప్రాయపడినట్టు సమాచారం. మొత్తంగా గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు అడిగితే… దుర్గామాత భక్తులకూ లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పేశారు.
This post was last modified on August 25, 2025 4:39 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…