Political News

రాజ‌కీయం నేర్చుకోవాలి జ‌గ‌న్‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాను చేస్తున్న రాజ‌కీయం మ‌రెవ‌రూ చేయ‌రు అని అనుకుంటే అంత‌క‌న్నా పొర‌పాటు లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్ర‌జ‌లు కూడా మారుతున్నారు. పాలను పాల‌లా, నీళ్లను నీళ్ల‌లానే చూస్తున్నారు. దీనిని అవ‌గ‌తం చేసుకుంటేనే రాజ‌కీయాల్లో కొన్నాళ్లు మ‌న‌గ‌లుగుతారు. లేక‌పోతే స‌ర్దేసుకునే ప‌రిస్థితి ఖాయం. ఇప్పుడు ఇదే ఏపీలోనూ జ‌రుగుతోంది. “ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నా రు” అని రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు త‌ర‌చుగా చెబుతుంటారు.

ఇది నిజం కూడా! కానీ ప్ర‌జ‌లు గ‌మ‌నించిన దానికి అనుగుణంగా నాయ‌కులు న‌డుచుకోవాలి. ముఖ్యంగా పార్టీల అధినేత‌లు వ్య‌వ‌హ‌రించాలి. ఈ విష‌యంలోనే జ‌గ‌న్ త‌ప్పుల‌పై త‌ప్పులు చేస్తున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది. తాను ప‌ట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లే అన్న చందంగా వ్య‌వ‌హ‌రించి న‌ష్ట‌పోయారు. ఇది తెలుసుకుని ప్ర‌జ‌ల నాడిని గుర్తెరిగితేనే త‌ప్ప జ‌గ‌న్‌కు ఫ్యూచ‌ర్ లేదు. ఇది వాస్త‌వం. కానీ ఆయ‌న ఆ ప‌ని చేయ‌డం లేదు. ప్ర‌జ‌లు ఒక‌ప్పుడు ఉన్న మాన‌సిక స్థితిలోనే ఇప్పుడు ఉన్నార‌న్న వాద‌న‌లో జ‌గ‌న్ ఉన్నారు.

కానీ ప్ర‌జ‌లు ఎప్పుడో మారారు. పార్టీల‌ను చూడ‌డం లేదు. మంచిని, తమ‌కు ప్ర‌యోజ‌న‌క‌రం అనుకున్న వాటిని మాత్ర‌మే చూస్తున్నారు. అదే గ‌త ఎన్నిక‌ల్లోనూ నిజ‌మైంది. ఒక‌ప్పుడు గ‌త ప్ర‌భుత్వాలు తెచ్చిన ప‌థ‌కాల‌ను ఎత్తేసినా ప‌రవాలేదనుకున్న ప్ర‌జ‌లు ఇప్పుడు అలా లేరు. ప‌థకం ఏదైనా మంచి ఉంటే, త‌మ‌కు మేలు చేస్తుంద‌ని అనుకుంటే కొన‌సాగించాల‌నే కోరుతున్నారు. కానీ జ‌గ‌న్ అన్నా క్యాంటీన్ వంటి కీల‌క కార్య‌క్ర‌మాన్ని ఎత్తేశారు. ప్ర‌జాభ‌వన్‌ను కూల‌దోశారు. అమ‌రావ‌తిని అట‌కెక్కించారు. ఈ ప‌రిణామం ఆయ‌న‌కు పెద్ద మైన‌స్ అయింది.

ఇక ఇప్పుడు జ‌రుగుతున్న విష‌యానికి వ‌స్తే, అసెంబ్లీకి జ‌గ‌న్ వెళ్లాల‌ని మెజారిటీ ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఇది ప్ర‌త్య‌ర్థులు చెబుతున్న మాట కాదు. ఆన్‌లైన్ ఛానెళ్లు చేస్తున్న స‌ర్వేలు చెబుతున్న మాట‌. జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్లి ప్ర‌జ‌ల త‌ర‌ఫున మాట్లాడాల‌ని కోరుకునే వారు ఎక్కువ‌గా ఉన్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావాల‌ని కూడా కోరుతున్నారు. ఈ రెండు విష‌యాల్లోనూ జ‌గ‌న్ ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ల‌కుండా భీష్మించుకుంటున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తే ఏదో జాత‌ర‌లా వ‌స్తున్నారు. ఇది స‌రికాదు. ప్ర‌జ‌ల నాడి తెలుసుకుని వారికి అనుగుణంగా రాజ‌కీయాలు మ‌లుచుకునే దిశ‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్‌కు ఎంతైనా ఉంది.

This post was last modified on August 22, 2025 12:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago