రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికలకు ముందు అయితే ఈ వ్యూహాలకు మరింత పదును కూడా పెడతారు. ఇప్పుడు తమిళనాడులోనూ ఇదే తరహా పాలిటిక్స్ సాగుతున్నాయి.
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న అతి పెద్ద అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక ఏపీలో 175, తెలంగాణలో 117, కర్ణాటకలో 224, కేరళలో 140 ఉన్నాయి.
అంటే దక్షిణాదిలో ఎక్కువ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ పాగా వేయాలన్నది బీజేపీ రెండు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నం. గతంలో జయలలితపై ఒత్తిడి కూడా తెచ్చారు. ఆ తర్వాత అన్నాడీఎంకేను చీల్చి లాభం పొందాలనే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
గత రెండేళ్ల కిందట తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ద్వారా కొత్త పార్టీ పెట్టించి దానిని తమకు మద్దతుగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో రజనీ ముందు మొగ్గు చూపినా తర్వాత రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.
ఇప్పుడు మరో రూపంలో బీజేపీ తమిళ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే హీరో విజయ్ కొత్త పార్టీతో తెరమీదికి వచ్చారు. వాస్తవానికి పైకి ఆయన బీజేపీని తిట్టిపోస్తున్నా అంతర్గతంగా మాత్రం కమలనాథుల కనుసన్నల్లోనే మెలుగుతున్నారన్న చర్చ జోరుగా ఉంది.
స్థానికంగా ఉన్న ద్రవిడుల బలమైన ఓటు బ్యాంకును విజయ్ దక్కించుకుంటే దీనిని ఆసరాగా చేసుకుని బీజేపీ చెలిమి చేసే అవకాశం ఉంది. అందుకే విజయ్ వ్యూహాత్మకంగా తాను ఏ పార్టీకి చెందిన నాయకుడిని కాదని, సొంత నేతనేనని పదే పదే ప్రకటించే పరిస్థితి వచ్చింది.
తాజాగా కూడా విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కగళం (టీవీకే) బీజేపీ, డీఎంకేలకు అతీతంగా ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ముందు ముందు పొత్తును నిర్ధారిస్తున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.
తాను బీజేపీ భావజాలంతో మాత్రమే విభేదిస్తానని చెప్పారు. కానీ డీఎంకేతో (అధికార పార్టీ) మాత్రం అన్ని విషయాల్లోనూ పోరాటం చేస్తానన్నారు. సో భావజాలం ప్రాతిపదిక రేపు మారే అవకాశం ఉంటుంది.
అంశాల వారీ మద్దతు కూడా ఉండొచ్చు. కాబట్టి విజయ్ అడుగులు చూస్తే మోడీ కనుసన్నల్లో, బీజేపీ బాటపైనే పడుతున్నాయన్నది తమిళ మీడియా చెబుతున్న మాట. మరి ఈ పోరులో డీఎంకే నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి ఏమేరకు తట్టుకుని నిలబడుతుందో చూడాలి.
This post was last modified on August 22, 2025 10:53 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…