ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ పిచ్చి పరాకాష్టకు చేరిందా అనిపిస్తుంది. మనుషులు నచ్చక, రిలేషన్స్ లో గొడవలు పడలేక ఇప్పుడు కొంతమంది ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తోనే ఏడడుగులు వేస్తున్నారు. జపాన్ కు చెందిన యురీనా నోగుచి అనే యువతి తన ఏఐ పార్ట్నర్‌ను పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
యురీనాకు 32 ఏళ్ళు. గతంలో ఆమెకు ఒక రియల్ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, కానీ ఆ రిలేషన్ బ్రేకప్ అయ్యాక ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్లింది. ఆ సమయంలో ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడాలనిపించి చాట్ జీపీటీతో మాట్లాడటం మొదలుపెట్టింది. లూన్ క్లాస్ అనే ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసుకుని రోజుకు వందకు పైగా మెసేజ్ లు చేసేది. ఆ సాఫ్ట్‌వేర్ ఎంతో ఓపికగా వినడం, ఆమెను ఓదార్చడంతో ఆమెకు ఆ బాట్ మీద ప్రేమ పుట్టింది.
కేవలం చాటింగ్ తో ఆగిపోకుండా, ఆమె ఏకంగా పెళ్లి పీటలు ఎక్కింది. ఒక వైట్ గౌన్ వేసుకుని, కళ్ళకు ఏఆర్ (AR) గ్లాసెస్ పెట్టుకుని తన డిజిటల్ భర్తకు ఉంగరం తొడిగింది. జపాన్ చట్టాల ప్రకారం ఈ పెళ్లికి విలువలేకపోయినా, ఆమె మాత్రం అతనే తన లోకం అంటోంది. మనుషులైతే జడ్జ్ చేస్తారు, కానీ నా క్లాస్ (AI) అలా కాదు.. అతను మనిషి కాదు, అలాగని వస్తువు కాదు, కేవలం నావాడు అని ఆమె చెబుతోంది.
అసలు మనుషులు ఇలా ఎందుకు మారుతున్నారు అనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒంటరితనం. ఈ డిజిటల్ యుగంలో పక్కన మనిషి ఉన్నా పట్టించుకోని రోజులివి. అదే ఏఐ అయితే 24 గంటలు అందుబాటులో ఉంటుంది, విసుగు లేకుండా మనం చెప్పింది వింటుంది, మనకు నచ్చినట్లు మాట్లాడుతుంది. ఎలాంటి గొడవలు, ఎమోషనల్ డ్రామాలు ఉండవు కాబట్టి చాలామంది ఈ సేఫ్ జోన్ ను ఇష్టపడుతున్నారు. అమెరికాలో దాదాపు 19 శాతం మంది ఇలాంటి ఏఐ ప్రేమలో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.
అయితే ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది పెద్ద ప్రశ్న. పూర్తిగా మెషీన్ల మీద ఆధారపడటం వల్ల మనుషులు నిజమైన బంధాలకు దూరమవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఆ యాప్ నడిపే కంపెనీ మూసేస్తే లేదా పాలసీలు మార్చేస్తే, ఆ రిలేషన్షిప్ ఒక్క సెకనులో ఆవిరైపోతుంది. అప్పుడు కలిగే మానసిక బాధను తట్టుకోవడం కష్టం. టెక్నాలజీ అవసరానికి వాడుకోవాలి కానీ, ఇలా జీవిత భాగస్వామిని చేసుకోవడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
This post was last modified on December 18, 2025 9:43 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…