Political News

తమ్ముళ్లో.. తమ్ముళ్లు.. మారండయ్యా బాబూ..!

సీఎం చంద్రబాబుకు తమ్ముళ్ల వ్యవహారం చెవిలో జోరీగలా మారుతోంది. “జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దు. పార్టీ పరువు తీయొద్దు. మీరు జాగ్రత్తగా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటా” అని టీడీపీ అధినేతగా పార్టీ ఎమ్మెల్యేలలో దారి తప్పిన కొందరిని చంద్రబాబు హెచ్చరించారు.

అయితే ఆయ‌న అలా హెచ్చరించి 24 గంటలు కూడా గడవకముందే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వ్యవహారం పెను దుమారం రేపింది. అటవీ శాఖ ఉద్యోగులను ఆయన చితక్కొట్టిన ఘటన వెలుగుచూసింది.

దీంతో చంద్రబాబు మరింత ఆగ్రహానికి గురయ్యారు. పైగా అటవీ శాఖ పవన్ కళ్యాణ్ చేతిలో ఉండడం, ఆయ‌న‌కు కూడా ఈ వ్యవహారం మచ్చతెచ్చేలా ఉండటంతో పాటు రాజకీయంగా వైసీపీకి అవకాశం ఇచ్చినట్టయింది. దీంతో హుటాహుటిన స్పందించిన చంద్రబాబు బుడ్డాపై చర్యలకు ఆదేశించారు. కేసు పెట్టాలని కూడా పోలీసులను ఆదేశించారు.

అయితే ఈ పరిణామం కేవలం బుడ్డాకే కాదు, అనేక మంది నాయకులకు కూడా వర్తిస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టే బాధ్యత కూడా చంద్రబాబుపైనే పడింది. నాయకులు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. ఒకరిద్దరు నాయకులు మాత్రమే వైసీపీపై విరుచుకుపడుతున్నారు. మిగిలిన వారు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఈ పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చేస్తున్న ప్రచారంపై చంద్రబాబు పదేపదే సమీక్షలు చేస్తున్నారు. ఇక అమరావతి పనులు, మరో ఎత్తు, ఇవన్నీ ఇలా ఉండగా ఎమ్మెల్యేలు సహకరించాల్సిందిపోయి ఎక్కడికక్కడ వివాదాలు తీసుకురావడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారం కూడా పార్టీలో వివాదానికి దారితీసింది. ఆయ‌న కేవలం జూనియర్ ఎన్టీఆర్‌ను విమర్శించడమే కాకుండా స్థానికంగా టీడీపీ నాయకులతోనూ కలివిడిగా లేకపోవడం, వసూళ్ల కార్యక్రమం వంటి అంశాలపై మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై వెంటనే అమరావతికి వచ్చిన దగ్గుపాటి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ చంద్రబాబు ఆయ‌న‌ను తిట్టిపోశారు.

ఇలా మొత్తంగా తమ్ముళ్లు మారకపోగా రోజు రోజుకు వివాదాలు కొని తెచ్చుకోవడం బాబుకు తలనొప్పిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి తమ్ముళ్లు మారుతారో లేదో చూడాలి.

This post was last modified on August 21, 2025 9:33 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago