పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం నాటి లోక్ సభ సమావేశాలు అత్యంత ఉద్రిక్త వాతావరణంలో సాగాయి. అధికార పక్షంపై ఓ రేంజిలో విరుచుకుపడ్డ విపక్షాలు నానా రచ్చ చేశాయి. అందులో భాగంగా ఒకానొక సమయంలో పలు కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై విపక్షాల సభ్యులు ఆయ బిల్లుల ప్రతులను చించివేసి… ఆ చిత్తు కాగితాలను ఆయన మీదకే విసిరిపారేశారు. ఈ ఘటనతో అధికార పక్ష: ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆపై సభను స్పీకర్ కొంతసేపు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా విపక్షాలు తమ ఆందోళనలను ఏమాత్రం తగ్గించలేదు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన మూడు కీలక బిల్లులకు మంగళవారం నాటి కేబినెట్ బేటీ ఆమోద ముద్ర వేయగా వాటిని హోం మంత్రి హోదాలో అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. వీటిలో పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులను క్రిమినల్ కేసుల ఆధారంగా పదవీచ్యుతులను చేసేందుకు ఉద్దేశించినది ఓ బిల్లు. ఈ బిల్లుపై విపక్షాలు అప్పటికే ఓ రేంజి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో సదరు బిల్లును అమిత్ షా సభలో ప్రవేశపెట్టగానే… విపక్ష సభ్యులంతా తమ స్థానాల్లో నుంచి వెల్ లోకి దూసుకువచ్చారు. తమ చేతుల్లోని బిల్లుల ప్రతుల కాపీలను చించివేసి ఆ చిత్తు కాగితాలను షాపై విరిసిపారేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
వాస్తవానికి అధికార పక్షం ఏదైనా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గానీ, రాష్ట్రపతో, గవర్నరో ప్రసంగించేటప్పుడు గానీ… ఆయా బిల్లుల ప్రతులను చించివేసి సభాధ్యక్ష స్థానంపై విపక్షాలు విసిరివేయడం పరిపాటి. అయితే అందుకు బిన్నంగా బుధవారం నాటి లోక్ సభ సమావేశాల్లో కాంగ్రెస్ సహా ఇండియా కూటమి సభ్యులంతా చిత్తు ప్రతులను అమిత్ షాపైకి విసిరివేశారు. అయితే ఈ తరహా నిరసనను అమిత్ షా ఏమాత్రం పట్టించుకోకుండానే తాను ప్రవేశపెట్టాలనుకున్న మరో రెండు బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టి… విపక్షాలకు అభ్యంతరం ఉందని చెబుతున్నారు కాబట్టి వాటిని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించారు.
This post was last modified on August 20, 2025 9:59 pm
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…