Political News

‘ట్వీట్‌’తోనే జ‌గ‌న్ స్వాతంత్య్రం!

అధికారంలో ఉంటే.. ఒక‌లా, అధికారం కోల్పోతే మ‌రోలా వ్య‌వ‌హ‌రించ‌డం నాయ‌కుల ల‌క్ష‌ణం. అయితే.. దేశానికి సంబంధించిన పండుగ‌ల విష‌యంలో కూడా ఇలానే చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ము ఖ్యంగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. 79వ స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని జెండా ఎగ‌రేస్తారేమో.. పార్టీ కార్య‌క‌ర్త‌లు, లేదా త‌మ‌కు ఓటేసిన వారిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తారేమో.. అని నాయ‌కు లు ఎదురు చూశారు. కానీ, ఆ జాడ ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

తాడేప‌ల్లి పార్టీ ఆఫీసులో జ‌గ‌న్ జాడ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మ‌రి ఆయ‌న ఉన్నారో.. లేక బెంగ‌ళూరుకు వెళ్లారో కూడా స‌మాచారం లేదు. ఇదిలావుంటే.. స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని.. జ‌గ‌న్‌, ఓ చిన్న ట్వీట్‌తో స‌రిపుచ్చారు. ‘స‌మాన హ‌క్కులు, న్యాయం, ఐక్య‌తే మ‌న స్వాతంత్య్రానికి మూలం. ప్ర‌జాస్వామ్య దేశానికి ఇవే బ‌లంగా నిలుస్తాయి. ఈ విష‌యాన్ని అంద‌రూ గుర్తుంచుకోవాలి.’ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇంత‌కు మించి.. జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించ‌డం కానీ, ప్ర‌సంగాలు చేయ‌డం కానీ.. చేయ‌లేదు.

అంతా స‌జ్జ‌లే..

మ‌రోవైపు తాడేప‌ల్లిలోని వైసీపీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో స‌ర్వం స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి మ‌యంగా మారిపోయింది. పార్టీ త‌ర‌ఫున విజ‌యంద‌క్కించుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మ‌హిళా నాయ‌కులు చాలా మంది ఉన్నా.. స‌జ్జ‌లే జెండా ఆవిష్క‌రించి.. రాజ‌కీయ ప్ర‌సంగం చేయ‌డంతో అంద‌రూ చిన్న‌బుచ్చుకున్నారు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇస్తార‌ని.. వారితో జెండా ఆవిష్క‌ర‌ణ చేయిస్తార‌ని వైసీపీ నాయ‌కులు అంచ‌నా వేసుకున్నారు.

కానీ, దీనికి భిన్నంగా స‌జ్జ‌లే రాజ‌కీయ ప్ర‌సంగంతోపాటు.. జెండాను కూడా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భం గా పులివెందుల‌, ఒంటిమిట్ట‌ల్లో జ‌రిగిన జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌లో వైసీపీ ఓడిపోలేద‌ని.. ఓడించార‌ని వ్యాఖ్యా నించారు. అన్యాయంగా, అక్ర‌మంగా ప్ర‌జ‌ల‌ను నిర్బంధించి.. వారే ఓట్లు వేసుకున్నార‌ని తెలిపారు. త‌మ న్యాయ పోరాటం కొన‌సాగుతుంద‌ని.. ప్ర‌జాస్వామ్య వాదులు స‌హ‌క‌రించాల‌ని స‌జ్జ‌ల కోరారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఓట్ల చౌర్యం జ‌రిగే.. రాష్ట్రంలో వైసీపీ ప‌రాజ‌యం పాలైంద‌న్నారు.

This post was last modified on August 15, 2025 4:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

21 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

51 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

1 hour ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 hours ago