ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు ఎప్పుడూ జగన్ ను, వారి పార్టీని సింహం సింగిల్ గా వస్తుంది అంటూ కీర్తిస్తూ ఉంటారు. ఇతర పార్టీల మద్దతు లేకుండానే నెట్టుకు వస్తున్నామని, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మాదిరిగా ఇతర పార్టీల మద్దతు తమకు అవసరం లేదని కూడా చెబుతూ ఉంటారు. అయితే ఆ సింగిల్ సింహం బలమెంతో పార్టీ అధినేత జగన్ కు ఇప్పుడు బాగానే అర్థమైనట్టే ఉందని చెప్పాలి. లేకపోతే ఎప్పుడూ తన నోట పలకని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేరు ప్రస్తావిస్తూ ఆయనపై నిష్ఠూరమాడతారా? అన్ని రాష్ట్రాల పేర్లు చెబుతున్నారు… ఏపీ ప్రస్తావన ఎందుకు తీసుకురారు? అంటూ రాహుల్ పై జగన్ నిజంగానే నిష్ఠూరమాడారు.
బుధవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ల జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా… పులివెందులలో రెండో పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయగా… జరిపితే అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలంటూ వితండ వాదన చేసిన వైసీపీ రీపోలింగ్ ను బహిష్కరించింది. ఈ క్రమంలో పులివెందుల, ఒంటిమిట్ల జడ్పీటీసీ అభ్యర్థులను తాడేపల్లి పిలిపించుకున్న జగన్… వారిని చెరోపక్క కూర్చోబెట్టుకుని జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన రాహుల్ గాంధీ ప్రస్తావనను తీసుకువచ్చారు. ఓట్ చోరీ అంటూ 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ చెప్పినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిందని రాహుల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ పోరాటం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఇదే విషయాన్ని ప్రస్తావించిన జగన్…. ఓట్ చోరీ అంటూ గొంతెత్తి మరీ నినదిస్తున్న రాహుల్ గాంధీకి ఏపీలో జరిగిన అక్రమాలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఏపీలో దొంగ ఓట్లు, ఈవీఎంల ట్యాంపరింగ్ రాహుల్ కు కనిపించలేదా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ, ఎంపీ సీట్లకు కూడా ఎన్నికలు జరిగాయి కదా అని ఆయన గుర్తు చేశారు. ఇందులో ఎన్నో అక్రమాలు జరిగితే తాము పోరాటం చేశామని, అయినా రాహుల్ ఏపీలో చోటుచేసుకున్న అక్రమాలను ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. ఇక ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ను కూడా ప్రస్తావించిన జగన్… చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాలను ఠాగూర్ ఒక్కసారైనా ప్రశ్నించారా? అని నిలదీశారు. తనను మాత్రం విమర్శించేందుకు ఠాగూర్ సిద్ధంగా ఉంటారని ఆయన మండిపడ్డారు.
అయితే ఎలాగూ రాహుల్ నుంచి తన వ్యాఖ్యలకు స్పందన రాదని ఓ అంచనాకు వచ్చిన జగన్… రాహుల్ ఏపీ సీఎం చంద్రబాబుతో హాట్ లైన్ లో నిత్యం టచ్ లో ఉంటారని, అందుకే ఏపీ గురించి రాహుల్ మాట్లాడరని ఓ సంచలన ఆరోపణ చేశారు. రాహుల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో చంద్రబాబు హాట్ లైన్ లో టచ్ లో ఉంటారని కూడా ఆయన ఆరోపించారు. సరే… ఆ ఆరోపణలను అలా పక్కనపెడితే…ఎన్నికల్లో అక్రమాలంటూ వైసీపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే నానా యాగీ చేసింది. అయితే ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ తన మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల అక్రమాలపై పక్కా ఆధారాలు సేకరించి మరీ అధికార ఎన్డీఏను, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇరుకునపెడుతున్న వైనంతో జగన్ కు తన పార్టీ బలం ఏమిటో అర్థమైందని, అందుకే రాహుల్ గాంధీపై ఆయన ఒకింత నిష్ఠూరంగా మాట్లాడారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
This post was last modified on August 13, 2025 9:44 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…