ఏపీలో అటు అధికార పక్షం రథసారథి టీడీపీ, ఇటు విపక్షం వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం పోలింగ్ ముగిసిన తర్వాత బుధవారం కూడా ఈ విచిత్రాల పరంపర కొనసాగింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక తీరుపై ఒకింత అనుమానం కలిగిన ఎన్నికల సంఘం… రెండు పోలింగ్ కేంద్రాల్లో బుధవారం రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ కేంద్రాల్లో రీపోలింగ్ బుధవారం ప్రారంభం కాగా… వైసీపీ అభ్యర్థి మాత్రం తాడేపల్లిలోని జగన్ వద్దకు చేరిపోయారు. జగన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన దర్శనమిచ్చారు.
పులివెందులతో పాటు కడప జిల్లాలోని ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ వైసీపీ ముందుగానే చేతులెత్తేసిందని ఇదివరకే చెప్పుకున్నాం కదా. అదే మాదిరిగా వైసీపీ వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంగళవారం పోలింగ్ జరుగుతూ ఉంటే… వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి తన ఇంటి గడప కూడా దాటకుండా తాము ఓటు వేసేందుకు అవకాశమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనకు భద్రత కల్పించడంలో పోలీసులు ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. అయితే ఇద్దరు పోలీసులతో హేమంత్ కు భద్రత కల్పించామని, వారిలో ఓ సీఐ స్థాయి అధికారి కూడా ఉన్నారని స్వయంగా కడప జిల్లా ఎస్పీనే ప్రకటించడం గమనార్హం.
ఇక తాజాగా రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తే… రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రకటించారు. మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసిన ఆయన.. కేవలం పోలీసులను రక్షించేందుకే ఎన్నికల సంఘం రెండు పోలింగ్ కేంద్రాల్లోనే.. అది కూడా ఎలాంటి గొడవలు జరగని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహణకు సిద్ధపడిందని ఆయన తనదైన శైలి వితండ వాదనను వినిపించారు. మొత్తంగా రీపోలింగ్ ను వైసీపీ అయితే బహిష్కరించింది. జగన్ పిలుపు మేరకు ఒంటిమిట్ట వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డితో కలిసి హేమంత్ రెడ్డి ఎంచక్కా తాడేపల్లి చేరుకుని జగన్ కు అటొకరు, ఇటొకరు కూర్చుని మీడియా కెమెరాలకు కనిపించారు.
This post was last modified on August 13, 2025 12:07 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…