పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నికల్లో వైసీపీ ముందే చేతులెత్తేసిందా? గత నాలుగు దశాబ్దాలలో ఎప్పుడూ లేనంత ప్రతిఘటనను ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబం ఎదుర్కొంటుందా? అంటే పులివెందుల తాజా రాజకీయ వాతావరణం చూస్తుంటే అవుననే చెప్పాలి.
పులివెందుల జెడ్పిటిసికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ జెడ్పిటిసి పరిధిలో మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఏజెంట్లను బూత్‌లలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇతర నియోజకవర్గాల నుంచి వెళ్లిన టిడిపి కార్యకర్తలు పులివెందును ఆక్రమించారు. చివరికి వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారంటే అక్కడ అధికార పార్టీ ఏ స్థాయిలో మేనేజ్‌మెంట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ జెడ్పిటిసి ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి టిడిపి వాళ్లు అధికారం అడ్డం పెట్టుకుని అరాచకానికి తెరలేపారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒక దశలో వైసీపీ ఎన్నికలను బహిష్కరిస్తుందని సొంత పార్టీ వాళ్లతో పాటు టిడిపి నాయకులు కూడా అనుకున్నారు. అయితే జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం కావడంతో తమ పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టారు.
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు ఇతర ముఖ్య నాయకులపై దాడి జరిగింది. అయినా వైసీపీ ఎక్కడా వెనక్కు తగ్గలేదు. చేతులు ఎత్తేయలేదు.
ఈ జెడ్పిటిసి పదవీకాలం మరో 10 నెలలు మాత్రమే ఉంది. దీనికోసం పులివెందులలో ఇంతటి అరాచకానికి పాల్పడటం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 15 పోలింగ్ బూత్‌ల పరిధిలో కనీసం వైసీపీ ఏజెంట్లను కూడా అడుగుపెట్టకుండా టిడిపి రాజకీయం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూడుసార్లు ఎంపీగా గెలిచిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సైతం పోలీసులు ఈడ్చికెళ్లి జీపులో వేశారు. ఆయనను కడప తీసుకు వెళ్లారు. మరోవైపు టిడిపి రౌడీ మూకలు బూత్‌లు ఆక్రమించుకొని తమ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేస్తున్నారని వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు.
ఏది ఏమైనా పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడించామని చెప్పుకోవటంలో ఆ కిక్కే వేరని టిడిపి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. పోలింగ్‌కు ముందు పరిస్థితులు చూస్తుంటే వైసీపీ ముందే చేతులెత్తేసిందా అన్నట్టుగానే ఉంది.
This post was last modified on August 12, 2025 11:30 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…