పార్టీని నడిపించేందుకే కాదు.. పార్టీని బలోపేతం చేసేందుకు కూడా సలహాలు కావాలి. కేవలం ప్రజల్లో ఏర్పడే సానుభూతిని నమ్ముకుని.. ముందుకు సాగే పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో నాయకులకు, పార్టీలకు కూడా లేదు. ఎందుకంటే.. ప్రజల మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో పట్టుకోవడం.. అంత ఈజీ కాదు. ఇప్పుడున్నట్టుగా.. వచ్చే రెండేళ్ల తర్వాత రాజకీయాలు ఉండవు. ప్రజల మూడ్ కూడా ఉండదు. నిన్న మొన్నటి వరకు వైసీపీ మాత్రమే.. సంక్షేమం అమలు చేసిందన్న ప్రచారం చేసుకున్నారు. దీనికి తామే పేటెంట్ పొందామన్నారు.
కానీ, ప్రస్తుతం అమలవుతున్న పథకాలు.. దాదాపు 45 శాతం మంది లబ్ధిదారుల్లో సంతోషాన్ని నింపుతు న్నాయి. ఈ విషయాన్ని ఎవరూ విస్మరించలేరు. పైగా ఇప్పటి వరకు కొన్ని పథకాలు చేరువ కానీ.. కొంత అసంతృప్తితో ఉన్న వారిని కూడా మచ్చిక చేసుకునేందుకు.. వారిలో ఆనందం నింపేందుకు.. కూటమి సర్కారు ఈ నెల 15 నుంచి.. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని చేరువ చేస్తోంది. దీనికి ఉన్న అన్ని నిబం ధనలను దాదాపు తొలగించింది. ఫలితంగా.. ఎక్కడ నుంచి ఎక్కడకైనా.. దీనిలో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది.
తద్వారా.. ఇప్పటి వరకు ఇతర పథకాల్లో ఉన్న లోపాలను ఈ ఫ్రీ బస్సు సర్వీసు పూర్తిగా తుడిచేయనుం ది. ఇది సర్కారుకు చాలా వరకు మేలు చేస్తుందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. వచ్చే మూడు సంవ త్సరాల పాటు కూడా.. దీనిని అమలు చేస్తారుకాబట్టి.. ఇతర పథకాలు ఎలా ఉన్నా.. ఇంటి బయటకు రాగానే ఉచితంగా బస్సు కనిపిస్తే.. ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. ఇది.. ప్రత్యక్షంగా కూటమికి మేలు చేసే ప్రక్రియ. ఇక, వైసీపీ పరంగా చూస్తే.. పార్టీలో దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాము.. ముందు నుంచి విమర్శలు చేయకుండా ఉంటే.. బాగుండేదని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు.
అంటే.. గత మూడు మాసాల నుంచి వైసీపీ సోషల్ మీడియాలో.. ఉచిత బస్సుపై వ్యతిరేక ప్రచారం చేశా రు. ఉచితం అంటే.. కేవలం మండలాలకేనని, జిల్లాలకేనని.. కానీ, ఎన్నికలకు ముందు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉచితమని హామీ ఇచ్చారని విమర్శలు గుప్పించారు. ఈ వ్యతిరేక ప్రచారాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ చేసింది. తద్వారా.. వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చి నట్టు అయింది. అంతేకాదు.. వైసీపీ అవాక్కయ్యేలా చేసింది.
ఇక, ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ చేయడం వెనుక కూడా కీలక రీజన్ ఉంది. ఇప్పటి వరకు ఇతర పథ కాల్లో లబ్ధి పొందని వారు, మధ్యతరగతి వారుకూడా కూటమి సర్కారుకు సానుకూలంగా మారే అవకాశం ఉంటుందన్న అంచనాలు వున్నాయి. ఇక, ఇతర పథకాలకు ఏటా ఎంత లేదన్నా.. 10 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలి. కానీ, ఫ్రీ బస్సులో అయితే.. కేవలం 2 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అందరినీ ఆనందంగా ఉంచొచ్చు. అందుకే వ్యూహాత్మకంగా చంద్రబాబు వైసీపీకి బ్రేకులు వేశారన్న టాక్ వినిపిస్తోంది.
This post was last modified on August 10, 2025 8:50 am
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…