దేశవ్యాప్తంగా రాఖీ పండుగను అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, ఇరు తెలుగు రాష్ట్రాలలోని రెండు హై ప్రొఫైల్ కుటుంబాలలో మాత్రం రాఖీ పండుగ సందడి కనిపించడం లేదు. రాజకీయ వైరంతో ఒకరు… రాజకీయంగా అంతర్గత విభేదాలతో మరొకరు రాఖీ పండుగ జరుపుకోలేదు. ఏపీ మాజీ సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల రాఖీ కట్టకపోవడం… కవిత రాఖీ కట్టేందుకు సిద్ధంగా ఉన్నా కేటీఆర్ అందుబాటులో లేకపోవడం హాట్ టాపిక్‌గా మారాయి.
కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలలో కవిత వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పార్టీకి, కవితకు వచ్చిన గ్యాప్, కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ లీక్ కావడం నేపథ్యంలో కేటీఆర్, కవితల మధ్య గ్యాప్ వచ్చింది. అవన్నీ పక్కనబెట్టి అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టేందుకు కవిత సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే, నిన్న లగచర్లకు చెందిన అక్కచెల్లెమ్మలతో రాఖీ కట్టించుకున్న కేటీఆర్… అటు నుంచి అటే బెంగళూరు వెళ్లారు. నిన్నే తాను రాఖీ కట్టేందుకు ఇంటికి వస్తానని కేటీఆర్‌కు కవిత నిన్న ఉదయం మెసేజ్ చేశారట.
అయితే, ఆయన బెంగుళూరు వెళ్లిన తర్వాత తాను ఊళ్లో లేనని రిప్లై ఇచ్చారట. దీంతో, రాఖీ పండుగ రోజు కవిత తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. రాజకీయపరంగా అభిప్రాయభేదాలు, విభేదాలు, మనస్పర్థలు ఉన్నప్పటికీ అన్న కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టేందుకు ముందుకు వచ్చినా, ఆయన పెద్దగా సుముఖత చూపకపోవడంతో ఆమె బాగా హర్ట్ అయ్యారట. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ నాడు కూడా కలవకపోవడంపై కవిత బాధపడుతున్నారట.
మరోపక్క, ఏపీలో వైసీపీ నేతలపై, అన్న జగన్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్న షర్మిల… కనీసం రాఖీ పండుగ నాడు కూడా అన్నకు రాఖీ కట్టేందుకు ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది.
This post was last modified on August 9, 2025 5:25 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…