పయ్యావుల కేశవ్.. రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో తొలిసారి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. నిజానికి సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా… ఆయనకు ఇప్పుడే.. ఫస్ట్ టైమ్ మంత్రి పదవి దక్కింది. అది కూడా కీలక మైన ఆర్థిక శాఖను ఆయన భుజాన మోస్తున్నారు. దీనికి ఉన్న ఏకైక కారణం.. వైసీపీ హయాంలో ప్రజా పద్దుల కమిటీకి చైర్మన్(పబ్లిక్ అకౌంట్స్)గా ఆయన వ్యవహరించారు. దీంతో ఆర్థిక వ్యవహారాలు ఆయన కు బాగా తెలుసునన్న భావనతో చంద్రబాబు దీనిని ఆయనకు అప్పగించారు.
అయితే.. చిత్రం ఏంటంటే.. ఏడాదికిపైగా ఆశాఖకు మంత్రిగా ఉన్న పయ్యావుల ఇంకా తడబాట్లు పడు తూనే ఉన్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానిస్తుండడం. ఇది వాస్తవం. వైసీపీ హయాంలో జరిగిన కాంట్రాక్టు పనులకు బిల్లులు చెల్లించరాదని తీసుకున్న విధాన పరమైన నిర్ణయాన్ని సైతం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పక్కన పెట్టి వారికి బిల్లులు చెల్లించారు. ఈ విషయం కొన్నాళ్ల కిందటే పెద్ద ఎత్తున వివాదం అయింది. అయితే.. దీనిని సమర్థించుకునే ప్రయత్నం చేసి.. మరో పొరపాటు చేశారు.
ఇక, విశాఖలోని రుషి కొండపై నిర్మించిన ఇంద్ర భవనం లెక్కలు తేలకుండానే అప్పట్లోనూ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించారు. ఇది తీవ్ర అంశమని సీఎం చంద్రబాబు అంతర్గత సమావేశాల్లోనే చెప్పుకొచ్చారు. అయితే.. ఈ విషయం అసలు తన దృష్టికి రాలేదని పయ్యావుల మీడియా ముందే చెప్పేసి.. చేతులు కాల్చుకున్నారు. వాస్తవానికి ఒక శాఖ మంత్రిగా.. ఆయన శాఖలోని అధికారులపై పట్టు పెంచుకోవాలి. వారిని హద్దులు దాటకుండా చూసుకోవాలి. ఈ విషయంలో ఆయన ఏడాది అయినా.. తడబాట్లు పడుతూనే ఉన్నారు.
ఇక, తాజాగా కూడా మరో పొరబాటు చేసి… ఆర్థిక శాఖ వ్యవహారాలపై.. ఆయన ఇబ్బందులు తెచ్చుకున్నా రనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ పర్యటనలకు వచ్చినప్పుడు.. రహదారుల వెంబడి ఉన్న చెట్లను నరికేశారు. దీనిని జిల్లాల వారీగా కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే.. అప్పట్లో ఈ బిల్లులు కూడా చెల్లించలేదు. పైగా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వైసీపీ సర్కారు వెనక్కి తగ్గింది. దీనిని అప్పట్లో టీడీపీ సహా.. అనుకూల మీడియా పెద్ద ఎత్తున తప్పుబట్టింది.
అలాంటి కాంట్రాక్ట్ పనులకు కూడా గుట్టు చప్పుడు కాకుండా సొమ్ములు చెల్లించేశారు. దీనిపై తాజాగా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని తెలిసింది. అసలు ఆర్థిక శాఖలో ఏం జరుగుతోంది? ఏయే అధికారులు ఉన్నారో.. తనకు వివరాలు ఇవ్వాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది.
This post was last modified on August 9, 2025 4:58 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…