తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు కదా. ఈ స్నాక్స్ ఇప్పటిదాకా వివిధ రకాల రంగుల్లో పిల్లలు, పెద్దల కళ్లను ఇట్టే ఆకట్టుకునేవి. ఎంత వద్దనుకున్నా… ఆ ప్యాకెట్ల కలర్లే ఆ స్నాక్స్ ను కొనేలా చేశాయి.
అయితే ఇప్పుడు ఆ స్నాక్స్ ప్యాకెట్లు కేవలం బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమే వస్తాయట. స్నాక్స్ లవర్స్ ను తీవ్రంగా కలచివేసే ఈ వార్త అక్షరాలా నిజమే. ఎందుకంటే ఇరాన్ యుద్ధం ఆయా స్నాక్స్ కంపెనీలకు సిరా (ఇంక్) కరువు వచ్చేలా చేసిందట. ఫలితంగా స్నాక్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను కేవలం బ్లాక్ అండ్ వైట్ ప్యాకెట్లలోనే పెట్టేసి విక్రయాలు సాగించే పరిస్థితి వచ్చింది.
జపాన్ కు చెందిన ప్రముఖ స్నాక్స్ కంపెనీ కాల్బీ… తన ఉత్పత్తులను ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కవర్లలోనే పెట్టి విక్రయిస్తోంది. ఈ మేరకు సదరు సంస్థకు చెందిన స్నాక్స్ ప్యాకెట్లకు సంబంధించిన కలర్ ఫుల్ ప్యాకెట్లతో పాటుగా కలర్ లెస్ గా కేవలం బ్లాక్ అండ్ వైట్ గా కనిపిస్తున్న ఫొటోలు… అందుకు దారి తీసిన అంశాలను ఆధారం చేసుకుని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆసక్తికర వార్తలు ప్రచురిస్తున్నాయి. వెరసి బ్లాక్ అండ్ వైట్ స్నాక్స్ ప్యాకెట్లు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.
అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ప్రత్యేకించి మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి దారుణంగా మారిందని చెప్పక తప్పదు. ఈ యుద్ధం కారణంగా సరుకు రవాణా ప్రమాదంలో పడిపోయిందని చెప్పాలి. ఇక ఇరాన్ నుంచి ఆయా దేశాలకు రవాణా అవుతున్న ముడి చమురుకు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పలు దేశాలకు సిరా అంటే ఇంక్ సరఫరా కూడా దాదాపుగా స్తంభించిపోయిందట. ఏదో వారం పది రోజుల పాటు ఆయా వస్తువుల రవాణా నిలిస్తే ఫరవా లేదు గానీ… నెలల తరబడి ఆయా వస్తువుల రవాణా నిలిస్తే… దానికి ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే కదా.
ఇదే భావనతో సాగిన కాల్బీ కంపెనీ తన స్నాక్ ప్యాకెట్లను ఆకర్షణీయ రంగుల్లో విడుదల చేయడానికి స్వస్తి చెప్పేసింది. ఎందుకంటే ఈ కంపెనీకి యుద్ధం కారణంగా చాలా రోజులుగా ఇంక్ అందడం లేదట. ఇంక్ లేదని మొత్తంగా తన ఉత్పత్తులను ఆ కంపెనీ నిలిపివేయలేదు కదా. అందుకే… తన స్నాక్స్ ఉత్పత్తులను యధావిధిగా కొనసాగిస్తున్న కాల్బీ… వాటిని వినియోగదారులకు అందించే కవర్లను మాత్రం బ్లాక్ అండ్ వైట్ లో అందిస్తోందట.
ఈ మేరకు ఆ కంపెనీ ఓ అడ్వైజరీని కూడా విడుదల చేసింది. ఇంక్ సరఫరా పునరుద్దరణ అయ్యేదాకా స్నాక్స్ కవర్లను ఇలాగే బ్లాక్ అండ్ వైట్ లోనే విడుదల చేయాలని ఆ కంపెనీ తీర్మానించింది.
This post was last modified on May 12, 2026 9:53 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…