పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు. చెన్నైలో ఉన్నారని ఒకరు, హైదరాబాద్ లో ఉండి పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశ పనులు చూసుకుంటున్నారని మరొకరి ఇలా రకరకాల వెర్షన్లు వినిపిస్తున్నారు. ముంబైలో పద్దెనిమిదో తేదీ ట్రైలర్ లాంచ్ జరగనుంది. భోపాల్ లో ఐటెం సాంగ్ విడుదల చేస్తారు. ఇందులోనే రెహమాన్ లైవ్ కన్సర్ట్ ఉంటుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
నిజానికి రెహమాన్ ఈ పద్ధతికి వ్యతిరేకం కాదు. గతంలో ఎన్నో తమిళ సినిమాలకు స్టేజి మీద లైవ్ ఇచ్చారు. ధనుష్ రాయన్ కోసం ఇచ్చిన పెర్ఫార్మన్స్ వీడియోల రూపంలో చాలా వైరల్ అయ్యింది. ఆయన ప్రత్యక్షంగా మ్యూజిక్ చేస్తూ పాటలు పాడితే ఆ వైబ్ వేరేలా ఉంటుంది. అయితే రెహమాన్ కు అంత టైం ఉందానేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. లైవ్ అంటే ముందస్తుగా ప్రిపరేషన్లు చేసుకోవాలి. రిహార్సల్స్ అవసరం. చూస్తేనేమో పెద్ది రిలీజ్ కు ఇరవై రోజులే ఉంది.
ఇప్పుడు రెహమాన్ ప్రోగామ్ గురించి ఎక్కువ ప్రచారం చేసి తీరా ఏదైనా కారణాల వల్ల భోపాల్ లో అది నిర్వహించలేకపోతే నెగటివ్ అవుతుంది. కానీ ఆ సమస్య లేదు. బుచ్చిబాబు ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉంటుందని స్పష్టంగా చెప్పేశారు కాబట్టి సందేహాలు అక్కర్లేదు. లైవ్ కన్సర్ట్ అంటే హ్యాపీనే. అందరూ ఎంజాయ్ చేస్తారు. జాతీయ స్థాయిలో కవరేజ్ వస్తుంది. మైలేజ్ కూడా పెరుగుతుంది. అభిమానులు కోరుకుంటున్నది ఇలాంటి మైలేజ్ ఇచ్చే ప్రమోషన్లే.
పెద్ది టీమ్ కాళ్ళకు విమానాలు కట్టుకుని పరుగులు పెడుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పబ్లిసిటీ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నా బెస్ట్ అవుట్ ఫుట్ కి పబ్లిసిటీ అవసరం లేదనే ధోరణి మేకర్స్ లో కనిపిస్తోంది. అలాని పెద్దిని లైట్ తీసుకోవడం లేదు. ట్రైలర్ లాంచ్ అయ్యాక నాన్ స్టాప్ గా రెండు వారాల పాటు ప్రచారం హోరెత్తిపోయేలా పలు కార్యక్రమాలు ప్లాన్ చేశారట. పిఠాపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ప్రతిపాదన ఉందట కానీ సాధ్యం కాకపోవచ్చని టాక్.
This post was last modified on May 12, 2026 10:50 pm
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…