Political News

గువ్వలతో వెళ్లే ఆ ఐదుగురు ఎవరు?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో పొలిటికల్ జంపింగ్ లు మొదలైపోయాయి. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోతున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బీజేపీ కార్యాలయానికి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాంచందర్ ఓ సంచలన వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ కు చెందిన ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరుతున్నారని ఆయన తెలిపారు. వారి చేరికల తేదీలనూ త్వరలోనే వెల్లడిస్తానని కూడా ఆయన చెప్పడం గమనార్హం.

బీఆర్ఎస్ కే చెందిన మరో మాజీ ఎమ్మెల్యే అబ్రహాం (అలంపూర్) కూడా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలే. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి మరీ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరే నేతలు ఎవరబ్బా అని రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. అయినా ఉరుము లేని పిడుగు మాదిరిగా రాంచందర్ రావు ఈ వ్యాఖ్య చేసినంతనే బీఆర్ఎస్ పెను కలవరమే రేగినట్లు సమాచారం. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ వాటి నుంచి బయటపడలేక ఆపసోపాలు పడుతోంది. అలాంటి సమయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారంటే బీఆర్ఎస్ అధిష్ఠానానికి కలవరపాటు తప్పదు కదా.

ఈ ఐదుగురి ఎమ్మెల్యేల విషయంతోనే ముగించని రాంచందర్ రావు..మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో నేతలు ఇమడలేకపోతున్నారని, ఈ కారణంగానే ఇప్పటికే చాలా మంది ఆ పార్టీని వీడారని, ఇప్పుడు మరింత మంది బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని గ్రహించిన మీదటే ఆ పార్టీ నేతలు పార్టీని వీడుతున్నారని చెప్పారు. గువ్వల బాలరాజు ఈ నెల 10న బీజేపీలో చేరుతున్నారని, ఇది చేరికల ఆరంభం మాత్రమేనని, స్థానిక సంస్థల ఎన్నికల ముందు మరింతమేర మంది బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి చేరనున్నారని, ఆ సంఖ్యను ఊహించడం కూడా కష్టమేనని ఆయన చెప్పారు. 

రాంచందర్ రావు వ్యాఖ్యల్లో నిజం ఏ మేర ఉందో తెలియదు గానీ… ఆయన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శిబిరంలో పెను కలవరాన్నే రేపాయి. అదే సమయంలో బీజేపీ నేతల్లో జోష్ ను నింపింది. రాంచందర్ చెప్పినట్లు స్థానిక సంస్థల ఎన్నికల ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరితే మాత్రం… లోకల్ పోల్స్ లో కమల దళం సత్తా చాటడం ఖాయమనే చెప్పాలి. అధికార పార్టీగా కాంగ్రెస్ మెజారిటీ సాధించినా… గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో స్తానిక సంస్థలను బీజేపీ గెలుచుకోవడం ఖాయమన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి.

This post was last modified on August 9, 2025 12:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago