Political News

ఇది కూడా ఒక కేసా? కూనంనేని హ్యాపీస్‌

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని కొత్త‌గూడెం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2023లో విజ‌యం ద‌క్కించుకున్న క‌మ్యూనిస్టు నాయ కుడు, సీపీఐ నేత‌.. కూనంనేని సాంబ‌శివ‌రావుకు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై న‌మోదైన కేసును, అదేవిధంగా పిటిష‌న్‌ను కూడా సుప్రీంకోర్టు ప్రాథ‌మిక ద‌శ‌లోనే తోసిపుచ్చింది. ఇలాంటి కేసులు కూడా కేసులేనా? స‌మ‌యం వేస్ట్.. అని వ్యాఖ్యానిస్తూ.. కూనంనేనిపై న‌మోదైన పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. దీంతో కామ్రెడ్ కూనంనేనికి ఇక‌, చిక్కులు తొలిగిపోయిన‌ట్టే. ప్ర‌స్తుతంతెలంగాణ అసెంబ్లీలో సీపీఐ త‌ర‌ఫున ఒకే ఒక్క స‌భ్యుడిగా కూనంనేని ఉన్న విష‌యం తెలిసిందే. పైగా సీఎం రేవంత్ రెడ్డితోనూ మంచి ర్యాపో కొన‌సాగిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

2009లో తొలిసారి కొత్త‌గూడెం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న కూనంనేని.. త‌ర్వాత‌.. 2023 ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టులు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో ఆపార్టీ ఒక స్థానాన్ని క‌మ్యూనిస్టుల‌కు కేటాయించింది. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ నేత‌, పైగా ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన పేరున్న కూనంనేనిని సీపీఐ ఎంపిక చేసి.. ఎ న్నిక‌ల బ‌రిలో నిలిపింది. ఆయ‌న విజ‌యం కూడా ద‌క్కించుకు న్నారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం కూడా వినిపిస్తున్నారు. అయితే.. అదే ఎన్నిక‌ల్లో ఏఐఎఫ్‌బీ(ఆలిండియా ఫార్వ‌ర్డ్ బ్లాక్‌) పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన మాజీ బీఆర్ ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట్రావు 26 వేల ఓట్ల తేడాతో కూనంనేనిపై ప‌రాజ‌యం పాల‌య్యారు.

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల సమ‌యంలో నియమావ‌ళిని ఉల్లంఘించార‌ని.. నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కార‌ని.. అడ్డ‌దారిలో గెలిచార‌ని.. పేర్కొంటూ.. కూనంనేనిపై ఎన్నిక‌ల పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆయ‌న స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసి.. తాను గెలిచిన‌ట్టుగా పేర్కొనాల‌ని కోరారు. ఈ కేసు 2024లో న‌మోదై.. అనేక సార్లు తెలంగాణ హైకోర్టులోనూ విచార‌ణ‌కు వ‌చ్చింది. అయితే.. ఆధారాలు లేవంటూ.. హైకోర్టు గ‌త ఏడాదే ఈ కేసును కొట్టి వేసింది. దీంతో వెంక‌ట్రావు.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అయితే.. అస‌లు ఈ పిటిష‌న్ దాఖ‌లు చేసి నెల‌లు గ‌డిచినా..విచార‌ణ‌కు రాలేదు. శుక్ర‌వారం సాయంత్రం ఈ పిటిష‌న్ గురించి.. వెంక‌ట్రావు త‌ర‌ఫున న్యాయ‌వాది లేవ‌నెత్తారు. దీనిని ప‌రిశీలించిన న్యాయ‌స్థానం.. ఇది కూడా ఒక కేసా? అంటూ.. ర‌ద్దు చేసింది.

ఇలాంటి పిటిష‌న్ల‌ను స్వీక‌రిస్తూ..పోతే, జీవిత కాలం స‌రిపోతుంద‌ని.. కోర్టుల‌కు ఇక వేరే ప‌నులు కూడా అవ‌స‌రం లేద‌ని ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప‌స ఉందో లేదో(వ్యాలిడిటీ ఆఫ్ పిటిష‌న్‌) చూసుకోవాల‌ని వెంక‌ట్రావు త‌ర‌ఫు న్యాయ‌వాదిని ఆక్షేపించింది. ఇదిలావుంటే.. జ‌ల‌గం వెంక‌ట్రావు.. 2014 ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌(అప్ప‌టి టీఆర్ ఎస్‌) త‌ర‌పు విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, రెండేళ్ల‌కే.. 2018లో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత‌.. బీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఆలిండియా ఫార్వ‌ర్డ్ బ్లాక్ త‌ర‌ఫున 2023లో పోటీ చేసినా ప్ర‌జ‌లు ఆయ‌న‌ను గెలిపించ‌లేదు.

This post was last modified on August 9, 2025 10:04 am

Share

Recent Posts

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

5 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago