రేపు హైదరాబాద్ యూసఫ్ గూడలో జరగబోయే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ పట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమనుల ఉద్వేగం మాములుగా లేదు. ఎందుకంటే తారక్ ని తెలుగు రాష్ట్రాల పబ్లిక్ స్టేజి మీద చూసి, తన మాటలు విని దశాబ్దం దాటేసింది. అన్న కళ్యాణ్ రామ్ సినిమా వేడుకలు లేదా ఇతర హీరోల కోసం గెస్టుగా వెళ్ళినప్పుడు తప్పించి తన కోసం ఈవెంట్ జరిగి అక్షరాలా పుష్కరం అయిపోయింది. గత ఏడాది దేవర వేడుకని నోవాటెల్ లో చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక రద్దు చేయాల్సి వచ్చింది. వెన్యూ దాకా వచ్చిన అతిథులు తమ క్యారవాన్లలో వెనక్కు వెళ్లిపోయారు. తారక్ అసలు చేరుకునే ఛాన్స్ లేకపోయింది.
ఇప్పుడు పోలీస్ గ్రౌండ్స్ కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. సో పెద్ద ఎత్తున జనాన్ని అనుమతించేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఆనందం కలిగించే విషయం. ఆందోళన ఏంటంటే గత రెండు రోజులుగా భాగ్యనగరాన్ని వర్షం ముంచెత్తుతోంది. ముఖ్యంగా సాయంత్రం పూట ఉగ్ర రూపం చూపిస్తోంది. ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించి జన జీవనం అస్తవ్యస్తం అయిపోతోంది. ఇలాంటి సిచువేషన్ లో వార్ 2 ఈవెంట్ కు వరుణ దేవుడు ఏమైనా పరీక్ష పెడితే ఇబ్బందులు తప్పవు. ఒకవైపు సముద్రంలా ఫ్యాన్స్ తాకిడి, ఇంకో వైపు సునామిలా రోడ్ల మీద నీటి వరద. అందరికీ ఇది పెద్ద సవాల్ అవుతుంది.
అందుకే ఎలాంటి అడ్డంకులు పెట్టొద్దు దేవుడా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే హృతిక్ రోషన్ లాంటి అతి పెద్ద బాలీవుడ్ స్టార్ నోటి వెంట యంగ్ టైగర్ గురించి ఎలివేషన్స్ వినే ఛాన్స్ రావడం. గెస్టులుగా వచ్చే త్రివిక్రమ్ లాంటి వాళ్ళు చెప్పబోయే విశేషాల కోసం అభిమానులు ఆతృతగా ఉన్నారు. వార్ 2 ప్రమోషన్లకు సంబంధించి జరగబోయే ఈవెంట్ ఇదొక్కటే. హీరో వైపు నుంచి ప్రెస్ మీట్ సూచనలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సో పబ్లిసిటీ ఘట్టంలో ఇదే అత్యంత కీలకం కానుంది. అందుకే ఎలాంటి విఘ్నాలు రాకూడదని నిర్మాతలు కోరుకుంటున్నారు.
This post was last modified on August 9, 2025 9:01 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…