ఒకప్పుడు వైసీపీ ఎలాంటి అడుగులు వేయాలన్నా సలహాదారులను వెంటపెట్టుకునేది. ముఖ్యంగా ప్రజ ల మధ్యకు వెళ్లాలన్నా.. ప్రజలతో చర్చలు చేయాలన్నా.. ఇతర పథకాలను రూపొందించాలన్నా.. కూడా సలహాదారులకు పెద్ద పీట వేసేవారు. ఎన్నికలకు ముందు వరకు కూడా.. సలహాదారులకు ప్రాధాన్యం ఉంది. కానీ, ఎన్నికల అనంతరం… కొందరు వారంతట వారుగా తప్పుకొన్నారు. మరికొందరిని పార్టీనే తప్పించింది. అయితే.. ఎప్పుడైనా సలహాదారులు ఉంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది.
ఉదాహరణకు టీడీపీలో సలహాదారులు చాలా మంది ఉన్నారు. కానీ, ఎవరూ బయటకు కనిపించరు. కానీ, కీలకమైన సలహాలు ఇస్తారు. పార్టీ ఎలా ఉండాలో.. నాయకులు ఎలా ఉండకూడదో కూడా .. చెప్పేవారు ఉన్నారు. ఫలితంగా టీడీపీలో ఒక విధానం కొనసాగుతూ.. నాయకులను కట్టుతప్పకుండా ఉండేలా చే స్తుంది. అంతేకాదు.. పార్టీ అధినేతకు కూడా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేవారు ఉన్నారు. ఇలా.. సలహాదారులకు పెద్దపీట వేస్తూ.. పార్టీని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి ఉంది.
ఈ తరహా పరిస్థితి.. వైసీపీలో కనిపించడం లేదు. దీంతో పార్టీ తరఫున కార్యక్రమాల నిర్వహణ, నాయకుల ను ముందుకు నడిపించే విషయంలోనూ ఇబ్బందులు తలెత్తున్నాయి. వాస్తవానికి.. సలహాదారులు ఉం టే.. పార్టీని క్షేత్రస్థాయిలో నడిపించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ప్రజల నాడిని తెలుసు కుని దానికి అనుగుణంగా అడుగులు వేసేందుకు కూడా చాన్స్ దక్కుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీ అధినేత జగన్ సలహాదారులపై దృష్టి పెట్టారు. త్వరలోనే నలుగురు సలహాదారులను తీసుకుం టున్నారు.
మూడు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని.. సలహాదారులను నియమించుకుంటున్నారు. 1) రాజకీ యంగా దూకుడు పెంచేలా చర్యలు: ఇప్పుడున్న విధంగా కాకుండా.. పార్టీని ఓ రేంజ్‌లో ప్రజల మధ్యకు తీసుకువెళ్లేలా.. సలహాలు ఇచ్చేవారికోసం ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2) వచ్చే ఎన్నికలకు సంబంధించి న కీలకమైన అంశాలు చెప్పేవారు: ఇది పార్టీకి ఇప్పుడున్న పరిస్థితిలో కీలకం. 3) నాయకుల శైలిని మార్చి.. ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం చూపించే వారు. ఇక, సలహాదారులుగా తీసుకునేందు కు.. రాజకీయాల్లో లబ్ద ప్రతిష్టులుగా పేరున్న ఐఐటీయెన్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీలో సలహాదారులు వస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates