తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త నిజం బయటకు వస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు వినిపించగా.. ఆ తర్వాత ఈ వ్యవహారం మరింత విస్తృతంగా జరిగినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోని నేతలపైనా నిఘా పెట్టేందుకు కూడా పార్టీ అధిష్ఠానం ఫోన్ ట్యాపింగ్ నే వినియోగించిందని శుక్రవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ కు గురైన బీఆర్ఎస్ బాధితుల్లో కేసీఆర్ కుమార్తె కవిత సహా ఆమె భర్త అనిల్, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావూ ఉన్నారట. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావుల ఫోన్లు మాత్రమే ట్యాప్ కాలేదని, ఇక అందరి ఫోన్లూ ట్యాప్ అయ్యాయంటూ ఆయన ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షిగా శుక్రవారం సిట్ ముందు విచారణకు హాజరైన బండి సంజయ్… విచారణలో భాగంగా సిట్ అధికారులకు కీలక ఆధారాలు అందజేశారు. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తు సిట్ నేతృత్వంలో సరిగా సాగడం లేదని, సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. పనిలో పనిగా ఫోన్ ట్యాపింగ్ కు ఎవరెవరు గురయ్యారన్న వివరాలను కూడా ఆయన వెల్లడించి కలకలం రేపారు. కేసీఆర్ తన కన్నబిడ్డ కవిత ఫోన్ నే ట్యాప్ చేయించారని ఆరోపించిన బండి… కవిత భర్త అనిల్ ఫోన్ నూ వదలలేదని తెలిపారు. ఇక పార్టీతో పాటు కేసీఆర్ కు ఆది నుంచి వెన్నెముకగా నిలుస్తూ వస్తున్న ఆయన మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు ఫోన్ నూ ట్యాప్ చేయించారంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ లెక్కన విపక్షాలకు చెందిన బడా, చోటా నేతలతో పాటుగా సొంత పార్టీకి చెందిన కీలక నేతల నుంచి కింది స్థాయి నేతల దాకా బీఆర్ఎస్ అధిష్ఠానం నిఘా పెట్టిందని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇక అందరికంటే కూడా తన ఫోన్ నే అత్యదిక సార్లు ట్యాప్ చేశారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ ఉచ్చులో చిక్కిన ప్రతి నేత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆయన ఆరోపించారు. ఇంతటి దారుణమైన నేరాలతో కూడిన కేసును సిట్ తో కాకుండా సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే… బండి సంజయ్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెలుసుకున్న బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుపై సరైన దర్యాప్తు జరిగేలా చూడాలని సంబంధిత అదికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
This post was last modified on August 8, 2025 8:51 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…