ఏపీలో ఏదైనా స్థలం లేదా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఒక యుద్ధం చేసినట్లే. రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాయడం…గంటల కొద్దీ జనం వేచి ఉండడం సర్వసాధారణం. అయితే, ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. పాస్ పోర్టు దరఖాస్తుకు స్లాట్ బుకింగ్ తరహాలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూ స్లాట్ బుకింగ్ విధానం కొద్ది రోజుల క్రితం అమలులోకి తెచ్చారు. దీంతో, చంద్రబాబు పాలనపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
దాంతోపాటు, తాజాగా రిజిస్ట్రేషన్ ప్రహసనం పూర్తయిన తర్వాత మ్యుటేషన్ ప్రక్రియలో జరిగే జాప్యం నివారించడానికి కూడా చంద్రబాబు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇకపై రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అయిన రోజే ఆటో మ్యుటేషన్ జరిగే విధానానికి చంద్రబాబు సర్కార్ నాంది పలికింది. నేటి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.
గతంలో అయితే, ప్రాపర్టీ కొన్నామన్న సంతోషం కూడా జనానికి ఉండేది కాదు. అమ్మిన వారి పేరు బదులు కొన్న వారి పేరు మ్యుటేషన్ కావడానికి వీఆర్వో, సంబంధిత ఉద్యోగుల చుట్టూ జనం తిరగాల్సి వచ్చేది. ఆస్తి పన్ను కట్టాలంటే పేరు మార్పు కాకకపోవడం అడ్డంకిగా మారింది. దానికి తోడు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై ఆ కష్టాలకు చెక్ పడినట్లయింది. అయితే, రిజిస్ట్రేషన్ సమయానికి ఆ ప్రాపర్టీకి సంబంధించిన పన్ను చెల్లించాల్సి ఉంటే మాత్రం మ్యుటేషన్ చార్జీలతో పాటు కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఆటో మ్యుటేషన్ జరగడం వల్ల అక్రమ రిజిస్ట్రేషన్ లకు కూడా అడ్డుకట్ట వేసినట్లే.
This post was last modified on August 1, 2025 2:06 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…