Political News

ఇకపై తిరుమలలో రీల్స్ చేస్తే…

దేశంలోని హిందువులకు పరమ పవిత్రమైన తిరుమలలో ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ.. వాటిని మీరి హద్దులు దాటి ప్రవర్తించే వాళ్లు చాలామందే ఉంటారు. అందులోనూ సోషల్ మీడియా కాలంలో పరిమితులు తెలియకుండా ప్రవర్తించే వాళ్లకు కొదవే లేదు. రీల్స్‌, షార్ట్స్ ద్వారా పాపులర్ కావడం కోసం తిరుమల ఆలయం ముందు.. మాడ వీధుల్లో వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. 

రోజు రోజుకూ ఈ వేషాలు శ్రుతి మించుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పందించారు. శ్రీవారి ఆలయం ఎదుట, మాడ వీధుల్లో ఇకపై ఎవరైనా రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. ‘‘ఇలాంటి చర్యలు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది.. ఇలాంటి వీడియోలు చిత్రీకరించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపడతాం’’ అని టీటీడీపీ ఓ ప్రకటనలో తీవ్రంగానే హెచ్చరించింది.

రీల్స్, షార్ట్స్ పిచ్చితో జనం విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారన్నది స్పష్టం. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా.. ప్రతిదీ వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. తిరుమలకు వచ్చామని చెప్పడానికి ఫొటోలు, వీడియోలు తీయడం వరకు ఓకే కానీ.. డ్యాన్సులు చేయడం, శ్రుతి మించి ప్రవర్తించడమే టీటీడీ హెచ్చరికలకు కారణం.

This post was last modified on August 1, 2025 9:49 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

11 hours ago