ఏపీ సీఎం చంద్రబాబు తన కేబినెట్‌ను ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ముహూర్తం కూడా పెట్టేశారని అంటున్నారు. దీంతో ఇదే కనుక నిజమైతే.. ఎవరికి అవకాశం చిక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీనియర్లు చాలా మంది వెయిటింగ్‌లో ఉన్నారు. పైగా.. దీనిపై పెద్దగా ఆశలు పెట్టుకున్నవారు కూడా కనిపిస్తున్నారు. దీంతో చంద్రబాబు చేతికి చాంతాడంత లిస్ట్ చేరిందని సమాచారం.
ఇదిలావుంటే.. మంత్రివర్గంలోకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు..ను తీసుకునే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిళ్లలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిలోనూ స్పీకర్ కంటే కూడా.. డిప్యూటీ స్పీకర్ వైపు మొగ్గు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు చంద్రబాబు తన కేబినెట్‌లో ముగ్గురిపై వేటు వేయనున్నట్లు తెలుస్తోం ది. ఆ ముగ్గురి ప్లేస్‌తో పాటు మరోకరికి కూడా అవకాశం కల్పించనున్నారు.
ఈ క్రమంలో జనసేనకు మరో సీటును కేటాయించడం ఖాయమని తెలుస్తోంది. మిగిలిన వాటిలో టీడీపీ నుంచి సీనియర్లకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. పైగా.. బలమైన వాయిస్ వినిపించే వారు.. ప్రభుత్వ పక్షాన మాట్లాడుతూ.. విపక్షాన్ని ఇరుకున పెట్టే మంత్రులు కావాల్సి ఉందని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడిని.. లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రఘురామకే మొగ్గు?
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలా మంది వైసీపీని టార్గెట్ చేయడంలో వెనుక బడ్డారని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామ కృష్ణరాజు అయితే బెటర్‌గా ఉంటుందన్న భావన ఉంది. గత ఎన్నికలకు ముందే టీడీపీలోకి వచ్చినప్పటికీ జగన్ ను నాడు అదే పార్టీలో రెబల్ ఎంపీగా ఏకేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పుడు కూడా రఘురామ అదే తీరుగా విమర్శలు గుప్పించి వైసీపీని లక్ష్యంగా చేసుకునేందుకు రఘురామ అయితే బెటర్ అన్న భావన వ్యక్తమవుతోందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 26, 2025 4:20 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…