రాష్ట్రంలో జిల్లాల పేర్లు అదేవిధంగా మండలాలకు కూడా కొత్తగా పేర్లు పెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటి.. ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.. అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఉదాహరణకు గత వైసిపి ప్రభుత్వం 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ వాటికి కొత్తగా పేర్లు కూడా పెట్టింది. అప్పట్లో కొన్ని జిల్లాల పేర్లు వివాదం కావడం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర ఘర్షణలు, గృహ దహనాలు కూడా చోటు చేసుకోవడం తెలిసిందే.
అదే విధంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటగా మార్చాలన్న డిమాండ్ కూడా అప్పట్లోనే వచ్చింది. ఇక సత్యసాయి జిల్లాకి హిందూపురం కేంద్రంగా మార్చాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఇక పల్నాడు జిల్లా పేరును గుర్రం జాషువా పేరు పెట్టాలనేది కూడా అప్పట్లో డిమాండ్ వినిపించింది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆయా జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పేర్లు మారుస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయా జిల్లాల వరకే పరిమితం కావాల్సిన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలను మరోసారి విభజించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించింది.
ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీ జిల్లాల్లో పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుని అదే విధంగా రాజకీయ నాయకులు నుంచి కూడా అభిప్రాయాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అంది స్తుంది. దీనికి నిర్దిష్టమైనటువంటి సమయం కానీ, కార్యాచరణ కానీ ప్రకటించలేదు. మరోవైపు 26 జిల్లాలను 34 గా మారుస్తారని కొందరు, కాదు 38 జిల్లాలుగా మార్చే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాను ఇప్పటికే రెండు జిల్లాలుగా మారిస్తే దీన్ని మూడు జిల్లాలుగా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అలాగే కృష్ణా జిల్లాను రెండు జిల్లాలుగా మారిస్తే ఇప్పుడు దీన్ని మూడు జిల్లాలుగా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 34 జిల్లాల వరకు విభజించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే పెద్దపెద్ద మండలాలుగా ఉన్నటువంటి వాటిని కుదించి రెండు మండలాలుగా విభజిస్తారన్న చర్చ కూడా నడుస్తుంది. దీనివల్ల రాజకీయంగా ప్రయోజనం ఏంటి.. లేకపోతే దీనివల్ల వచ్చే లాభం ఏంటి.. అనేది ప్రస్తుతానికి అంతుపట్టకపోయినా ఎన్నికల సమయానికి ప్రభుత్వం తనకు మేలు జరిగే లాగా వ్యవహరిస్తోంది అన్న ఆలోచన అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
చిన్నపాటి మండలాలుగా విభజించడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులను పెంచుకోవచ్చన్న ఆలోచన ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు జనాభా తక్కువ ఉన్న మండలాలకు జనాభా ఎక్కువగా ఉన్న మండలాలకు కూడా కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఒక్కొక్కసారి సమానంగా ఉంటుంది. దీనివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే మండలాలను కూడా విభజించే అవకాశం ఉందని.. జిల్లాలకు ఆయా ప్రాంతాల్లోని ప్రజల డిమాండ్లను బట్టి పేర్లు పెట్టే అవకాశం ఉందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 26, 2025 10:54 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…