Political News

ఉపరాష్ట్రపతి రేసులో కేసీఆర్..? నిజమెంత?

ఔను.. మీరు చదివింది నిజమే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. బీజేపీ తెరవెనుక పెద్ద వ్యూహం పన్నిందని, దీనికి కేసీఆర్ కూడా ఓకే చెప్పారని ప్రచారంలో కీలక భాగంగా చర్చ జరుగుతోంది. దీనిపై తెలంగాణలోని పత్రికలు కూడా ఇప్పుడిప్పుడే కథనాలు రాయడం మొదలుపెట్టాయి.

దీనితో ఏం జరుగుతుందో? అసలు ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది? అనే అంశాలు రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

ఎప్పటి నుంచో బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య తెరచాటు బంధం కొనసాగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత అరెస్టు, తర్వాత ఆమె బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య ఏదో మౌన ఒప్పందం జరిగిందన్న చర్చ మొదలైంది.

కవిత కూడా గతంలో చెప్పినట్లు, తాను జైలులో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలన్న విషయం చర్చకు వచ్చిందని, కానీ తాను ఒప్పుకోలేదని బాంబు పేల్చారు.

ఇక, పార్టీ ప్లీనరీలో కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించినా బీజేపీపై మాత్రం నొప్పి తగలకుండా వ్యవహరించారు. ఈ విషయాన్ని కవిత తన తండ్రికి రాసిన “Dear Daddy” లేఖలో కూడా ప్రస్తావించారు.

ఇవన్నీ కలిపి చూస్తే, బీఆర్‌ఎస్–బీజేపీ మధ్య తెరవెనుక పాలు పంచుకుంటున్నాయా? అన్న కోణంలో రాజకీయ చర్చలు వేగంగా సాగుతున్నాయి.

వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ బలపడాలని కేంద్ర వ్యూహకర్తల లక్ష్యం. కానీ ఒంటరిగా సాధ్యం కాదని అర్థమైన తర్వాత బలమైన బీఆర్‌ఎస్‌తో కలిసి ముందుకు సాగాలనే ఆలోచన తెరపైకి వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

విలీన ప్రతిపాదనలో భాగంగా వచ్చే ఎన్నికల్లో గెలిస్తే సీఎం పోస్టు బీజేపీకి, డిప్యూటీ సీఎం బీఆర్‌ఎస్‌కి ఇవ్వడం, అంతకంటే ముందే కేసీఆర్‌కు ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చి ఆయనను సంతృప్తి పరచడం ద్వారా వ్యూహాన్ని వేగవంతం చేయాలనే భావన బీజేపీ శిబిరంలో నడుస్తోందన్న చర్చ బలంగా వినిపిస్తోంది.

ఇక వీటిలో నిజమెంత? అనేది వేచి చూడాల్సిన విషయమే.

This post was last modified on July 24, 2025 4:30 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

20 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

29 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

43 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

45 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago