వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద పనిచేసిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి.. ఆ శవాన్ని అతని ఇంటికే స్వయంగా తీసుకెళ్లి అప్పగించిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు బాధ్యత తనదేనని.. తాను హత్య చేశానని అప్పట్లో పోలీసులకు అనంతబాబు తెలిపారు. ఇది మరో సంచలనం. ఆ కేసులో అరెస్టైన అనంతబాబు కొన్నాళ్లు జైల్లో ఉన్న తరువాత మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. అప్పటి నుంచి కూడా కేసు ముందుకు సాగలేదు.
2022 మే 19న జరిగిన ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. నేరారోపణ ఎదుర్కొంటున్న అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలనీ, పార్టీ నుంచి బహిష్కరించాలనీ పౌర సంఘాలు, దళిత సంఘాల నుండి డిమాండ్లు వచ్చాయి. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నించింది. చివరకు తూతూ మంత్రంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. నాలుగైదు నెలలకే ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలో పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాధిత కుటుంబం మంత్రి సుభాష్‌ను కలిసి విన్నవించింది. దీంతో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించింది. ఇక తాజాగా ఈ కేసును మరోసారి విచారించేందుకు వీలుగా రాజమండ్రి కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ అభ్యర్థనకు కోర్టు అనుమతి కూడా వచ్చింది. దీంతో డోర్ డెలివరీ కేసును తిరిగి విచారించనున్నారు. ఈ పరిణామాలతో అనంతబాబు మెడకు ఉచ్చు బిగిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న అనంతబాబును తిరిగి జైల్లోకి పంపేందుకు పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. అనంతరం ఆయన విదేశాలకు పారిపోకుండా లుక్‌ఔట్ నోటీసులు కూడా ఇవ్వనున్నట్టు, సుబ్రహ్మణ్యం తరఫున ప్రభుత్వం నియమించిన స్పెషల్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
This post was last modified on July 22, 2025 10:07 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…