Political News

వైసీపీ ఫైర్ బ్రాండ్‌కు దబిడిదిబిడే..

వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి కేసుల ఉచ్చు మరింత బిగిస్తోంది. తాజాగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంద‌ని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా సుదుం మండలంలో క్వార్ట్జ్ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డ కేసును విచారిస్తున్న అధికారులు.. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలుకు పంపించారు. ఈ క్రమంలో మరింత లోతుగా ఈ కేసును విచారిస్తున్న అధికారులు మరో మాజీ మంత్రి, ఇదే నెల్లూరు జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు అనిల్ కుమార్ పాత్ర కూడా ఉందని గుర్తించారు.

క్వార్ట్జ్ కేసులో అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని నుంచి మరింత సమాచారం రాబట్టారు. క్వార్ట్జ్ గనుల లీజు ముగిసిన తర్వాత కూడా తవ్వకాలు జరిపినట్టు శ్రీకాంత్ రెడ్డి ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. టన్నుకు వెయ్యి రూపాయల చొప్పున తనకు ఇచ్చారనీ, మిగిలిన సొమ్ము వారు తీసుకున్నారని వివరించాడు. ఈ క్వార్ట్జ్‌ను చైనాకు తరలించినట్టు శ్రీకాంత్ రెడ్డి వివరించాడు. ఈ సొమ్ముతో గూడూరు, నాయుడుపేట ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినట్టు తెలిపాడు. అలాగే హైదరాబాద్‌లోనూ రియల్ ప్రాజెక్టులు చేపట్టినట్టు వివరించాడు.

దీంతో క్వార్ట్జ్ కేసులో మాజీ మంత్రి అనిల్ పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు గుర్తించారు. శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అనిల్‌ పై కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆయన పాత్రపై మరింత సమాచారం సేకరించిన తర్వాత నోటీసులు ఇస్తామని, కేసును వేగవంతం చేస్తామని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ కేసులో మొత్తం రూ.200 కోట్లు చేతులు మారినట్టు గుర్తించిన అధికారులు.. దీనిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి పాత్రనే ఇప్పటివరకు గుర్తించగా, తాజాగా శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో మాజీ మంత్రి అనిల్‌పై కూడా కేసుకు రెడీ అవుతున్నారు.

2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న అనిల్ కుమార్ యాదవ్.. వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపించేవారు. అదే సమయంలో టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్‌పైనూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తొడగొట్టి మ‌రీ టీడీపీ నాయకులకు ఆయన సవాళ్లు విసిరారు. అసెంబ్లీలో మంత్రి అయిన ఆయన మీసం మెలేసి పోలవరం పై ప్రకటనలు చేశారు. అయితే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్టుగా.. గత ఎన్నికల్లో అనిల్ కుమార్‌ను జగన్.. నరసరావుపేట నుంచి ఎంపీగా నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా.. ఇటీవ‌ల మళ్లీ తెరమీదకు రావడం ప్రారంభించారు.

This post was last modified on July 22, 2025 10:05 pm

Share

Recent Posts

తిరుమల వెళ్తున్నారా? ఇది మాత్రం మిస్ అవ్వకండి!

తిరుమ‌ల తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేవారికి శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డం.. మొక్కులు చెల్లించుకోవ‌డం.. స్వామి వారి ప్ర‌సాదాన్ని స్వీక‌రించ‌డం గొప్ప అనుభూతి. శ్రీవారిని…

3 hours ago

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

4 hours ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

5 hours ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

6 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

6 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

7 hours ago